మార్కెట్ చూపంతా బడ్జెట్‌పైనే..

- మార్కెట్ పల్స్
ఊహించినట్టుగానే దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ ఒడిదుడుకులతో ట్రేడ్ అయ్యాయి. ప్రధాన సూచీ నిఫ్టీ 2.8 శాతం మేర కరెక్షన్కు గురైంది. దీంతో నిఫ్టీ ఇప్పటికీ స్వల్పకాలిక చలన సగటులకు దిగువనే ట్రేడ్ అవుతున్నది. క్రితం వారం కనీస స్థాయికన్నా దిగువన ముగియడం ద్వారా బేరిష్ సంకేతాలను ఇచ్చినైట్టెంది. అలాగే నెలవారి చార్ట్‌లో నిఫ్టీ షూటింగ్ స్టార్ క్యాండిల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా దీర్ఘకాల బేరిష్ సంకేతాలను కూడా ఇచ్చినైట్టెంది. సోమవారం నాటి భారీ పతనం తర్వాత రెండు రోజులపాటు లాభాలతో ట్రేడైన నిఫ్టీ.. శుక్రవారం గరిష్ఠ స్థాయి నుంచి 300 పాయింట్ల పతనంతో షూటింగ్ స్టార్ క్యాండిల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా డౌన్ ట్రెండ్‌ను తిరిగి ప్రారంభించినైట్టెంది. దీనికితోడు ఇప్పటికే నాలుగు రోజుల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. దీంతో ప్రతి పెరుగుదలలో అమ్మకాల ఒత్తిడిని మార్కె ట్ ఎదుర్కొన్నది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటి రూ.37,721 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. గత నాలుగు నెలల్లో రూ.1,38,689 కోట్ల అమ్మకాలు జరిపారు.
కాగా, మంగళవారం కేంద్ర బడ్జెట్ ఉన్నందున మార్కెట్ మరింత ఒడిదుడుకులకు గురికావచ్చు. గత పదేండ్లలో ఏడేండ్లపాటు బడ్జెట్ వారంలో మార్కెట్ నష్టాల్లోనే ముగిసింది. దీంతో ఈసారి బడ్జెట్ ప్రతిపాదనలపై ఎక్కువ అంచనాలు లేకపోయినప్పటికీ మార్కెట్‌ను ఉత్సాహపరిచే ప్రతిపాదనలు లేకపోతే మార్కెట్ మరింత పతనం కావచ్చు. బడ్జెట్ ప్రతిపాదనలు మార్కెట్ కదలికలకు ట్రిగ్గర్ పాయింట్ కానుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- budget
- Business
- Business news
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

