హైదరాబాద్, డిసెంబర్ 4: బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ అడ్వైర్టెజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) డైరెక్టర్‌గా మరోమారు శ్లోకా అడ్వైర్టెజింగ్ ఎండీ, సీఈవో కే శ్రీనివాస్ ఎన్నికయ్యారు. తెలంగాణ, ఏపీకి చెందిన శ్రీనివాస్‌కు అడ్వైర్టెజింగ్, మార్కెటింగ్ రంగాల్లో 30 ఏండ్ల అనుభవం ఉన్నది. ఈ క్రమంలోనే వరుసగా రెండోసారీ ఏఏఏఐ సారథ్య బాధ్యతల్ని అందుకున్నారు. ‘ఈ ప్రతిష్ఠాత్మక అసోసియేషన్ బోర్డుకు మళ్లీ ఎన్నికవడం చాలా సంతోషంగా ఉన్నది. సభ్యులందరి సహకారంతో నాకిచ్చిన బాధ్యతల్ని నెరవేరుస్తా’ అని శ్రీనివాస్ అన్నారు. కాగా, అడ్వైర్టెజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అధ్యక్షుడిగా గ్రూప్ ఎం మీడియా దక్షిణాసియా సీఈవో ప్రశాంత్ కుమార్ మళ్లీ ఎంపికయ్యారు. అలాగే ఉపాధ్యక్షుడిగా హవాస్ మీడియా రాణా బరువా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.