మెరిసిన బ్యాంకింగ్, ఐటీ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకులు, ఐటీ రంగ షేర్లతోపాటు బ్లూచిప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు మదుపర్ల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు మద్దతు లభించింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 1,533.72 పాయింట్లు లేదా 2.11 శాతం పుంజుకుని 74,315.61 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1,548.40 పాయింట్లు ఎగబాకింది. ఇక నిఫ్టీ కూడా 374.65 పాయింట్లు లేదా 1.66 శాతం ఎగిసి 22,997.35 వద్ద నిలిచింది.
- సెన్సెక్స్ 1,534, నిఫ్టీ 375 పాయింట్లు వృద్ధి
ముంబై, అక్టోబర్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. బ్యాంకులు, ఐటీ రంగ షేర్లతోపాటు బ్లూచిప్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు మదుపర్ల నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు మద్దతు లభించింది. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 1,533.72 పాయింట్లు లేదా 2.11 శాతం పుంజుకుని 74,315.61 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 1,548.40 పాయింట్లు ఎగబాకింది. ఇక నిఫ్టీ కూడా 374.65 పాయింట్లు లేదా 1.66 శాతం ఎగిసి 22,997.35 వద్ద నిలిచింది.
ఇదీ సంగతి..
అంతర్జాతీయ మార్కెట్లో పరుగులు పెడుతున్న ముడి చమురు ధరలకు బ్రేకులు పడటం.. మార్కెట్ సెంటిమెంట్‌ను బలపర్చింది. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ రేటు 2.34 శాతం పడిపోయి 103.60 డాలర్లకు దిగొచ్చింది. అలాగే ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ గతకొద్ది రోజులుగా పెరుగుతుండటం కూడా కలిసొచ్చింది. ఇక కృత్రిమ మేధస్సు విలువలు అతిగా పెరుగుతున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు, రెగ్యులేటర్లు, మార్కెట్ భాగస్వాములు దిద్దుబాటుకు అవకాశాలున్నాయని హెచ్చరించడం.. భారతీయ ఈక్విటీల్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి దోహదం చేసినట్టు తాజా సరళిని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతేగాక అమెరికాలో అధిక ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య విధానం, బాండ్ల రాబడుల్లో క్షీణత కూడా ఇన్వెస్టర్లను స్టాక్స్ వైపునకు మొగ్గు చూపేలా చేశాయని వారు అంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

