Car Loans | కొంత కాలం క్రితం వరకు కారంటే విలాస వస్తువు.. ఇక కారు కలిగి ఉండటం ఎంత మాత్రం లగ్జరీ వస్తువుగా పరిగణించలేం.. ప్రత్యేకించి కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరికి కారు తప్పనిసరి అవసరంగా మారుతున్నది. సొంతింటి కల అందరి దీర్ఘ కాల స్వప్నం.. ఈనాడు సొంతిల్లు కావాలన్నా.. కారు కొనాలన్నా రుణం తీసుకోవాల్సిందే. సొంతింటిని కొనుగోలు చేసిన తర్వాత రుణం ద్వారా కారు కొనుగోలు చేయొచ్చు. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు ఇతర రుణాల కంటే కార్ల రుణాలపై తక్కువ వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి. మీరు కారు కొనుగోలు చేయాలని భావిస్తే.. తక్కువ వడ్డీరేటుపై మీకు అవసరమైన రుణం ఇచ్చే బ్యాంకర్‌ను ఎంచుకోవాలి సుమా..! ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడాతోపాటు ప్రైవేట్ బ్యాంక్‌లు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీరేట్లపై కార్ల రుణాలిస్తున్నాయి. అవెంటో ఓ లుక్కేద్దామా..!
21 ఏండ్ల నుంచి 67 ఏండ్ల మధ్య వయస్సు గల ప్రతి ఒక్కరూ కారు రుణం తీసుకునేందుకు అర్హులే. ఉద్యోగులకు వారి నెలవారీ నికర వేతనంపై గరిష్ఠంగా 48 రెట్ల రుణం మంజూరు చేస్తుంది. ఒంటరిగా గానీ, జీవిత భాగస్వామితో గానీ కలిసి రుణం తీసుకుంటున్నట్లయితే, ఇద్దరి వార్షిక నికర ఆదాయం కనీసం రూ.3 లక్షలు ఉండాలని ఎస్బీఐ వెబ్సైట్ పేర్కొంటున్నది. ఇక ప్రొఫెషనల్స్, స్వయం ఉపాధిపై జీవిస్తున్న వారు, వ్యాపారులకు కూడా కార్ల కొనుగోలుకు రుణాలిస్తుంది. అయితే ఐటీ రిటర్న్స్ ప్రకారం నికర లాభాలు లేదా స్థూలంగా పన్ను చెల్లించే ఆదాయంపై నాలుగు రెట్లు గరిష్టంగా రుణం మంజూరు చేస్తుంది. ఇతర రుణాల రీ పేమెంట్స్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
ఇక వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలపై జీవిస్తున్న వారి నికర వార్షిక ఆదాయంపై మూడు రెట్లు గరిష్ఠంగా లోన్ మంజూరు చేస్తుంది. ఎస్బీఐ కార్లోన్ / ఎన్నారై కార్ లోన్/ అస్సూర్డ్ కార్ లోన్ కింద 7.25 నుంచి 7.90 శాతం వడ్డీ వసూలు చేస్తుంది. లాయాల్టీ కార్ లోన్ స్కీం కింద ఎస్బీఐ కార్ లోన్ లేదా ఎన్నారై కార్ లోన్ 7.20-7.90 శాతం, సర్టిఫైడ్ ప్రీ ఓన్డ్ కారు లోన్ స్కీం కింద 9.25 నుంచి 12.75 శాతం వడ్డీ వసూలు చేస్తుంది.
మరో ప్రభుత్వ రంగ బ్యాంక్.. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) కారు కొనుగోలుదారులకు 90 శాతం ఫైనాన్సింగ్ అందిస్తుంది. వడ్డీరేటు 7 నుంచి 9.75 శాతం మధ్య ఉంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం క్రెడిట్ ఇన్సూరెన్స్ కవరేజీ కొనుగోలు చేయని రుణ గ్రహీతలపై వడ్డీరేటు మరో 0.05 శాతం ఎక్కువ ఉంటుంది.
దేశంలోకెల్లా అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కారు లోన్ తీసుకున్న కస్టమర్లు ఆరు నెలల్లోపు ఫోర్ క్లోసర్కు అనుమతించదు. ఏడాది లోపు ప్రీ క్లోజర్ చేసుకునే వారిపై ఏడవ నెలవారీ వాయిదాలో ప్రిన్సిపల్ ఔట్ స్టాండింగ్ ఎమౌంట్పై 6 శాతం ఫీజు వసూలు చేస్తుంది. 13-24 నెలల్లో తొలి ఈఎంఐ అంటే 13 నెలలో ప్రీ క్లోజర్ చేసుకుంటే ఔట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ అమౌంట్‌పై ఐదు శాతం, 24 నెలల తర్వాత అంటే 25వ నెలలో ప్రీ క్లోజర్ చేసుకుంటే ఔట్ స్టాండింగ్ ప్రిన్సిపల్ అమౌంట్‌పై మూడు శాతం ఫీజు వసూలు చేస్తుంది.
మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంకు ఫిక్స్డ్ వడ్డీరేట్లపై నూతన కారు రుణాలు మంజూరు చేస్తున్నాయి. రుణ చెల్లింపుల గడువును బట్టి వడ్డీరేటు ఖరారవుతుంది. రుణ గడువు, ఇతర అంశాలను బట్టి వడ్డీరేటు 7.50-9 శాతంగా వడ్డీ నిర్ణయిస్తుంది బ్యాంక్. సిబిల్ స్కోర్, ఆటోమొబైల్ సెగ్మెంట్లో పరిణామాలు, కస్టమర్ రిలేషన్ షిప్, రుణ చెల్లింపుల గడువును బట్టి నూతన కార్ల కొనుగోళ్లపై వడ్డీరేటు ఖరారవుతుంది.
మీరు ప్రస్తుతం పొందుతున్న ఆదాయం, కారు విలువ, ప్రస్తుతం మీ ఖర్చులకు అనుగుణంగా మీ రుణ వాయిదాల చెల్లింపుపై అంచనాలు, కార్ల రుణాల అర్హత ఆధార పడి ఉంటుంది. మంజూరు చేసే రుణం, వడ్డీరేట్లు బ్యాంకు, బ్యాంకుకు మధ్య తేడాలుంటాయి. ఎక్కువ శాతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కార్ల విలువలో 80 శాతం రుణ పరపతి కల్పిస్తాయి. కొన్ని బ్యాంకులు మాత్రం 100 శాతం రుణం అందిస్తాయి.
కార్లపై రుణం పొందుతున్నప్పుడు మీ రుణ చెల్లింపుల సామర్థ్యాన్ని బట్టి నెలవారీ రుణ వాయిదాలను ఖరారు చేసుకోవాలి. తక్కువ నెలవారీ వాయిదాలతో దీర్ఘకాల గడువుతో పేమెంట్స్‌కు ప్రాధాన్యం ఇస్తే ఎక్కువ మొత్తంలో వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. రుణం తీసుకున్నప్పుడే వాయిదాలను మేనేజ్ చేసుకునేలా ఉండాలే తప్ప.. మీ రీసోర్సెస్‌పై ప్రతికూల ప్రభావం చూపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
నూతన కార్లపై తీసుకునే రుణాలు ఏడాది నుంచి ఏడేండ్ల గడువు ఉంటుంది. మీ అవసరాలు, ఆదాయాన్ని బట్టి రుణం టెన్యూర్ ఖరారు చేసుకునే ఆప్షన్ ఉంటుంది. కార్ల రుణాలు తీసుకునే వారిపై బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. రుణం తీసుకోవడానికి ముందే ప్రాసెసింగ్ ఫీజు ఎంతో నిర్దేశించుకోవాలి. ఫెస్టివ్ సీజన్లో కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజులు మాఫీ చేయడం గానీ, తక్కువ రేట్లు గానీ వసూలు చేస్తాయి.