SBI | కస్టమర్లకు ఎస్బీఐ గుడ్‌న్యూస్.. వడ్డీరేటు భారీగా తగ్గింపు
SBI | ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్ఆర్)లో ఒకదాన్ని సవరించింది. ఒక నెల టెన్యూర్ కలిగిన ఎంసీఎల్ఆర్ను 8.20 శాతానికి తగ్గించింది.
SBI | ముంబై, అక్టోబర్ 15: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ల (ఎంసీఎల్ఆర్)లో ఒకదాన్ని సవరించింది. ఒక నెల టెన్యూర్ కలిగిన ఎంసీఎల్ఆర్ను 8.20 శాతానికి తగ్గించింది. ఇంతకుముందు ఇది 8.45 శాతంగా ఉండేది. దీంతో పావు శాతం దిగినైట్టెంది. మంగళవారం నుంచే కొత్త రేటు అమల్లోకి వస్తుంది. ఫలితంగా ఆయా రుణాలను తీసుకున్న ఎస్బీఐ కస్టమర్లకు లాభించనున్నది.
ఏమిటీ ఎంసీఎల్ఆర్?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 2016 ఏప్రిల్‌లో ఈ ఎంసీఎల్ఆర్ను ప్రవేశపెట్టింది. అంతకుముందు బేస్ రేటు, బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్) అమల్లో ఉండేవి. 2016 ఏప్రిల్ తర్వాత రుణాలు తీసుకున్నవారికి ఎంసీఎల్ఆర్ ఆధారంగా వడ్డీరేట్లుంటాయి. అంతకుముందు లోన్లు తీసుకున్నవారికి బేస్ రేటు, బీపీఎల్ఆర్ ఆధారంగానే వడ్డీరేట్లు వర్తిస్తాయి. ఇక బ్యాంకులు ఈ ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీరేటుకు రుణాలను ఇవ్వకూడదు. ప్రస్తుతం ఓవర్‌నైట్ దగ్గర్నుంచి మూడేండ్లదాకా రకరకాల ఎంసీఎల్ఆర్లు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు ఎస్బీఐ మార్చింది నెల రోజుల ఎంసీఎల్ఆర్నే. మిగతా వాటిలో ఏ మార్పూ లేదు. ఎంసీఎల్ఆర్ పెరిగితే లోన్ల ఈఎంఐల భారం కూడా పెరుగుతుందన్న విషయం తెలిసిందే. అలాగే తగ్గితే రుణ వాయిదా చెల్లింపులూ తగ్గుతాయి. కాగా, ఎస్బీఐ బేస్ రేటు 10.40 శాతంగా ఉన్నది. బీపీఎల్ఆర్ 15.15 శాతం. ఇవి సెప్టెంబర్ 15 నుంచి అమల్లో ఉన్నాయి. ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (ఈబీఎల్ఆర్) 9.15 శాతంగా ఉన్నది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

