SBI Home Loans | ఎస్బీఐ ఇండ్ల రుణాలు మరింత భారం.. వెహికిల్లోన్ పిరమే!
SBI Home Loans | ఎస్బీఐలో ఇండ్ల రుణాలు, వాహన లోన్లు, పర్సనల్ లోన్లు తీసుకున్న రుణ గ్రహీతలపై వడ్డీ భారం పెరుగనున్నది.
SBI Home Loans | భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)లో ఇండ్ల రుణాలు తీసుకున్న వారికి నెలసరి వాయిదాల భారం పెరుగనున్నది. ఆర్బీఐ రెపోరేట్ పెంపునకు అనుగుణంగా ఎస్బీఐ తన మార్చినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పెంచడమే దీనికి కారణం. ఎస్బీఐ తన ఖాతాదారుల డిపాజిట్లపైనా వడ్డీరేట్లు పెంచేసింది. గతవారం 50 బేసిక్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. 211 రోజుల నుంచి మూడేండ్ల లోపు మెచ్యూర్ అయ్యే రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు 0.20 శాతం పెంచివేసింది. మంగళవారం (2022 జూన్ 14) నుంచి డిపాజిట్లపై వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇక తన రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 0.20 శాతం పెంచుతున్నట్లు వెల్లడించింది. పెరిగిన వడ్డీరేట్లు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయని వెల్లడించింది.
రుణాలపై ఎంసీఎల్ఆర్ 0.20 శాతం పెంపు
గతవారం ఆర్బీఐ రెపోరేట్ 50 బేసిక్ పాయింట్లు పెంచడంతో మొత్తం రెపోరేట్ 4.90 శాతానికి పెరిగింది. ఇది ఇప్పుడు అమల్లోకి వచ్చింది. ఆర్బీఐ రెపోరేట్ పెంచేసిన తర్వాత ఎస్బీఐ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) 0.20 శాతం పెంచేసింది. బుధవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
ఏడాది లోపు రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.20 నుంచి 7.40 శాతానికి పెరిగింది. మూడేండ్ల లోపు రుణాలపై వడ్డీరేటు 7.05 నుంచి 7.70 శాతానికి దూసుకెళ్లనున్నది. ఎస్బీఐ నుంచి ఖాతాదారులు తీసుకున్న రుణాల్లో అత్యధికం ఆటో, హోం, పర్సనల్ లోన్లు. వాటిపై ఎంసీఎల్ఆర్ పెరుగనున్నది. రెపోరేట్ లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) బుధవారం నుంచి అమల్లోకి వస్తుంది. ఈ నెల 8న ఆర్బీఐ రెపోరేట్ పెంచగానే పలు బ్యాంకులు తమ వడ్డీరేట్లు పెంచేశాయి.
ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు ఇలా
211 రోజుల నుంచి ఏడాది లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 4.40 శాతం నుంచి 4.60 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 4.90 శాతం నుంచి 5.10 శాతానికి పెంచివేసింది.
ఏడాది నుంచి రెండేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 5.30 శాతానికి పెంచేసింది. మూడేండ్ల పై చిలుకు వ్యవధి గల ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటు 5.20 నుంచి 5.35 శాతానికి పెంచింది.
దేశీయ హోల్‌సేల్ ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.2 కోట్లు, అంత కంటే ఎక్కువ మొత్తాలపై 0.75 శాతం వడ్డీరేటు పెరిగింది. రెండేండ్ల లోపు బల్క్ డిపాజిట్లపై మంగళవారం నుంచి 4.75 శాతం వడ్డీ రేటు అమలవుతుంది. ఇంతకుముందు నాలుగు శాతం వడ్డీ అమలయ్యేది. సీనియర్ సిటిజన్ల ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.50 శాతం నుంచి 5.25 శాతం వడ్డీ అమలు చేయనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC Bus Fare | కర్ణాటకలో ఆర్టీసీ చార్జీల బాదుడు.. నవంబర్ 5 నుంచి కొత్త రేట్లు!
Trump Warning | 10 నిమిషాల్లో మీ అణుశక్తిని అంతం చేస్తాం’.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
Personal Finance Tips | పొదుపే శ్రీరామరక్ష.. అప్పుల ఊబిలో పడకుండా ఉండేందుకు ఈ పొదుపు అలవాట్లు మొదలుపెట్టండి!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ఎలిమినేషన్.. రోహిత్‌కు షాకిచ్చిన హౌస్ మేట్స్ ఓటింగ్..!
Teachers Dress Code | ఇకపై టీచర్లు జీన్స్, టీషర్టులు వేసుకోవద్దు.. బీహార్ సర్కార్ సంచలన ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

