Samsung | శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్5 అండ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్5 ఫోన్ల సేల్స్ భారత్లో ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్2 ఎస్వోసీ చిప్సెట్తో వస్తున్న ఈ రెండు ఫోల్డబుల్ ఫోన్లు.. మోటరోలా రేజర్ 40 ఆల్ట్రాకు పోటీ ఇవ్వనున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 ఫోన్ 12 జీబీ రామ్ విత్ 256 జీబీ స్టోరేజీ ఆప్షన్ ఫోన్ రూ.99,999, 12 జీబీ రామ్ విత్ 512 స్టోరేజీ వేరియంట్ రూ.1,09,999 లకు లభిస్తాయి. క్రీమ్, గ్రాఫైట్, లావెండర్, మింట్ కలర్ ఆస్ఫన్లలో లభిస్తుంది. శాంసంగ్ వెబ్ సైట్ ద్వారా బ్లూ, గ్రే, గ్రీన్ కలర్ ఆప్షన్లలో విక్రయించనున్నది.
శాంసంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 ఫోన్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,54,999, 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,64,999, ఒక టిగా బైట్ జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.1,84,999 పలుకుతుంది. క్రీమ్, ఐసీ బ్లూ, ఫాంటం, బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభిస్తుంది. కంపెనీ వెబ్ సైట్ ద్వారా ప్లాటినం కలర్ ఆప్షన్ లోనూ విక్రయిస్తుంది.
Samsung | 26న శాంసంగ్ గెలాక్సీ మెగా ఈవెంట్.. స్పెషలాఫర్లు ఇలా..