Samsung Galaxy S24 FE | ప్రముఖ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఎఫ్ఈ (Samsung Galaxy S24 FE) ఫోన్ ను ఈ ఏడాది చివర్లో భారత్ మార్కెట్లో ఆవిస్కరించనున్నది. ఎక్స్ నోస్ 2400 ఎస్వోసీ లేదా క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్ సెట్ తో వస్తుందని భావిస్తున్నారు. 6.1-అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుందని తెలుస్తున్నది. 12 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ వేరియంట్ / 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌గా వస్తుందని చెబుతున్నారు. 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుందని భావిస్తున్నారు.
గతేడాది అక్టోబర్ నెలలో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ ఫోన్ 6.4 అంగుళాల డైనమిక్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ 2ఎక్స్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఎక్స్ నోస్ 2200 చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ గా అందుబాటులో ఉంది. 50-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 12-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, 8-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 10-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంది. 25 వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతో 4500 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో అందుబాటులో ఉంది.