Samsung : శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ ఫీచర్లు లీక్..ధర ఎంతంటే!

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనవరిలో ఎంట్రీ ఇవ్వనున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ ఫీచర్లపై తాజా లీకులు వెల్లడయ్యాయి. గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ ఫ్లాట్ డిస్ప్లే, స్లిమ్ డిజైన్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. ముందుభాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో 6.4 ఇంచ్‌ల అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉండే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.0పై రన్ అవుతుంది.
రియర్ కెమెరా సిస్టమ్‌లో 12 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్, 12 మెగపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సర్‌ను కలిగిఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో డ్యూయల్ సిమ్ ఆప్షన్లో అందుబాటులో ఉండనుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 4500ఎంఏహెచ్ బ్యాటరీతో 25డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ గ్రాఫైట్, లావెండర్, ఆలివ్ గ్రీన్, వైట్ కలర్స్‌లో లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ దాదాపు రూ 64,000 నుంచి అందుబాటులో ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Galaxy
- new launch
- SAMSUNG
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

