Samsung Galaxy M05 | మార్కెట్లోకి శాంసంగ్ ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్.. ఇవీ డిటైల్స్..!
Samsung Galaxy M05 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం05 (Samsung Galaxy M05) ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Samsung Galaxy M05 | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎం05 (Samsung Galaxy M05) ను గురువారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ ప్రాసెసర్ తో పని చేస్తుంది. 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ కెపాసిటీతో వస్తోంది. 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 25వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం5 (Samsung Galaxy M05) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999లకు లభిస్తుంది. మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది. అమెజాన్, శాంసంగ్ ఇండియా వెబ్ సైట్, సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం5 (Samsung Galaxy M05) ఫోన్ 6.74 అంగుళాల హెచ్డీ+ (720 x 1600 పిక్సెల్స్) పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు. వర్చువల్ గా ర్యామ్ కెపాసిటీ 8 జీబీ వరకూ పెంచుకోవచ్చు. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగా పిక్సెల్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. రెండేండ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్, నాలుగేండ్లు సెక్యూరిటీ అప్ డేట్స్ అందిస్తుంది. 4జీ, వై-ఫై 802.11 ఏ/బీ/జీ/ఎన్/ ఏసీ, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, బైదూ, గెలీలియో, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, లైట్ సెన్సర్, ప్రాగ్జిమిటీ సెన్సర్ కలిగి ఉండటంతోపాటు బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫేస్ అన్ లాక్ ఫీచర్ కు మద్దతుగా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

