Samsung Galaxy F34 5G | శాంసంగ్ నుంచి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్34 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Samsung Galaxy F34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.18,999 నుంచి ప్రారంభం అవుతుంది.
Samsung Galaxy F34 5G | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్.. భారత్ మార్కెట్లోకి మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించింది. సోమవారం శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్‌ను తీసుకొచ్చింది. గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌ను రీ బ్రాండ్ చేసి, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ ఆవిష్కరించింది. గత మార్చిలో గెలాక్సీ ఏ34 5జీ ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.18,999, 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.20,999లకు లభిస్తుంది. ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, శాంసంగ్ అఫిషియల్ వెబ్‌సైట్‌తోపాటు సెలెక్టెడ్ రిటైల్ స్టోర్లలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 11 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి.
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేసే వారికి రూ.2,111 నుంచి నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఐసీఐసీఐ లేదా కొటక్ మహీంద్రా బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. ఇతర బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే కొన్నిషరతులకు లోబడి ఆఫర్లు అందుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ రెండు కలర్స్ – ఎలక్ట్రిక్ బ్లాక్, మైస్టిక్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ 6.46 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2340×1080 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 398 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది. ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక్టాకోర్ ఎక్స్‌నోస్ 1280 ఎస్వోసీ చిప్సెట్తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ వన్ యూఐ 5.1 వర్షన్‌పై పని చేస్తుంది.
50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ కల ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్నది. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం 13-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ అత్యధికంగా 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింటర్ స్కానర్ గల ఈ ఫోన్ 5జీ, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, వై-ఫై, బ్లూటూత్ వీ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
HDFC Bank: విశ్వసనీయ సమాచారాన్ని లీక్ చేసిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి
Dhamma Parivartan Divas | ఆదిలాబాద్ జిల్లాలోని దళితవాడల్లో ఘనంగా దమ్మ పరివర్తన్ దివస్
Zumba | జుంబా, పైలేట్స్, హెచ్ఐఐటీ.. గుండెకు ఏ వ్యాయామం మంచిది?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

