Salesforce | సేల్స్‌ఫోర్స్‌లో లేటెస్ట్ లేఆఫ్స్ : సేల్స్, కస్టమర్ సర్వీస్ విభాగాల్లో కొలువుల కోత
టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ (Salesforce) మరో విడత లేఆఫ్స్‌కు తెగబడింది.
న్యూయార్క్ : టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. క్లౌడ్ ఆధారిత సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ (Salesforce) మరో విడత లేఆఫ్స్‌కు తెగబడింది. ఏడాది ఆరంభంలో ప్రపంచవ్యాప్తంగా తమ ఉద్యోగుల్లో 10 శాతం మందిపై వేటు వేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. అప్పట్లో 7000 మంది ఉద్యోగులను సాగనంపిన సేల్స్‌ఫోర్స్ మరోసారి లేఆఫ్స్ చేపట్టింది.
ఈసారి సేల్స్, కస్టమర్ సక్సెస్ టీమ్ సభ్యుల ఉద్యోగాలు ప్రభావితం కానున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. సేల్స్‌ఫోర్స్ మలివిడత లేఆఫ్స్‌లో పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగించిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ తెలిపింది. తమను విధుల నుంచి తప్పుకోవాలని కోరారని సేల్స్‌ఫోర్స్‌కు చెందిన సేల్స్, కస్టమర్ సక్సెస్ టీమ్‌ల ఉద్యోగులు వెల్లడించారని ఈ రిపోర్ట్ పేర్కొంది.
జనవరిలో ప్రకటించిన లేఆఫ్స్‌తో పోలిస్తే లేటెస్ట్ లేఆఫ్స్ భిన్నమైనవని, సరైన వనరులను సరైన దిశగా వాడే క్రమంలో ఈ చర్యలు చేపట్టామని కంపెనీ ప్రతినిధి వెల్లడించారని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 8000 మంది ఉద్యోగులను సాగనంపాలని సేల్స్‌ఫోర్స్ ప్రణాళికలు రూపొందించుకుందని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇతర దేశాలు, విభాగాల్లోని ఉద్యోగును తొలగిస్తారా అని ప్రశ్నించగా బదులిచ్చేందుకు కంపెనీ ప్రతినిధి నిరాకరించారు.
Read More :
Fake Univerisities | ఈ 20 యూనివర్సిటీల్లో అస్సలు చేరకండి.. స్టూడెంట్స్‌కు యూజీసీ వార్నింగ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

