కళామందిర్ ఐపీవోకి అపూర్వ స్పందన
కళామందిర్ పేరుతో దుస్తులను విక్రయిస్తున్న సాయి సిల్క్స్ ఐపీవోకి అపూర్వ స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 4.40 రెట్ల అధిక బిడ్డింగ్‌లు వచ్చాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 22: కళామందిర్ పేరుతో దుస్తులను విక్రయిస్తున్న సాయి సిల్క్స్ ఐపీవోకి అపూర్వ స్పందన లభించింది. సంస్థ జారీ చేసిన షేర్ల కంటే 4.40 రెట్ల అధిక బిడ్డింగ్‌లు వచ్చాయి. రూ.1,201 కోట్ల నిధుల సేకరణకు సంబంధించి 3,84,86,309 షేర్లను జారీ చేయగా, వీటికి 16,94,58,544 షేర్ల బిడ్డింగ్ దాఖలయ్యాయి. క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ బయ్యర్ల(క్యూఐబీఎస్) షేర్లు 12.35 రెట్లు సబ్‌స్ర్కైబ్ కాగా, నాన్-ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల 2.47 రెట్లు అధికంగా బిడ్డింగ్‌లు దాఖలయ్యాయి.
కానీ అలాగే రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడంతో కేవలం 88 శాతం సబ్‌స్ర్కైబ్ అయింది. రూ.210-222 షేరు ధరల శ్రేణిలో 2.70 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించనున్నది. ప్రస్తుతం సంస్థ కళామందిర్, వరమహాలక్ష్మీ సిల్క్స్, మందిర్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ పేర్లతో దుస్తులను విక్రయిస్తున్నది. అలాగే జూలై 31, 2023 నాటికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో 54 రిటైల్ అవుట్లెట్లను కలిగివున్నది. ఈక్విటీ షేర్లు త్వరలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ కానున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

