Russia Crude Oil | రష్యా ముడి చమురుపై తగ్గనున్న డిస్కౌంట్.. ప్రజలపై పెట్రో ‘వడ్డన’..?!
Russia Crude Oil | భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురుపై రష్యా ఇస్తున్న డిస్కౌంట్ నాలుగు డాలర్లకు తగ్గే సూచనలున్నాయి. ఇదే జరిగితే దేశీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరగనున్నాయని తెలుస్తున్నది.
Russia Crude Oil | గతేడాది ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి అమెరికా, ఈయూ దేశాలు నిరాకరించాయి. కానీ దీర్ఘకాలంలో అవసరాల కోసం రూట్ మార్చాయి. యుద్ధం సాగుతున్న వేళ.. రష్యా సైతం రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన మనీ కోసం భారత్‌కు బ్రెంట్ క్రూడాయిల్ ధరతో పోలిస్తే 30 డాలర్లకు పైగా డిస్కౌంట్ ధరకే బ్యారెల్ ముడి చమురు సరఫరా చేస్తూ వచ్చింది.
కానీ, ఇప్పుడు బ్యారెల్ ముడి చమురుపై భారత్‌కు రష్యా ఇస్తున్న డిస్కౌంట్ నాలుగు డాలర్లకు తగ్గిపోతుందని తెలుస్తున్నది. మరోవైపు ఇండియాకు ముడి చమురు సరఫరా చేస్తున్న రష్యా చమురు రవాణా సంస్థలు మాత్రం భారీగా చార్జీలు వసూలు చేస్తున్నాయి. రష్యా ముడి చమురుపై డిస్కౌంట్ తగ్గడం, రవాణా చార్జీలు ఎక్కువగా ఉండటంతో భారత్ మార్కెట్లో త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమెరికా, ఈయూ దేశాల నియంత్రణ వల్ల భారత దేశానికి రష్యా బ్యారెల్ చమురు ధర 60 డాలర్ల కంటే తక్కువ ధరకే విక్రయిస్తున్నది. కానీ, బాల్టిక్, నల్ల సముద్రం నుంచి భారత్ కు చేర్చడానికి బ్యారెల్ మీద 11-19 డాలర్ల మేర రవాణా చార్జీల భారం పడుతుంది. ఇది మార్కెట్ ధర కంటే ఎక్కువ.
ఉక్రెయిన్ మీద యుద్ధం ప్రారంభించక ముందు మొత్తం దేశీయ అవసరాల్లో రెండు శాతం ముడి చమురు మాత్రమే కొనుగోలు చేసిన భారత్ ముడి చమురు సంస్థలు తర్వాత దాన్ని 44 శాతానికి పెంచాయి. ఈ చమురు కొనుగోళ్ల కోసం కేంద్ర చమురు సంస్థలు ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. ప్రభుత్వ రంగ ముడి చమురు సంస్థలు రష్యా నుంచి 60 శాతం ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

