న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19 : ఈ-కామర్స్ సంస్థలు మరో అడుగుముందుకేశాయి. ఇప్పటికే అన్ని రకాల వస్తువులను విక్రయిస్తున్న సంస్థలు..తాజాగా ఈ జాబితాలోకి బైకులు కూడా చేరాయి. మధ్యస్థాయి మోటర్‌సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫిల్డ్కు చెందిన పలు బైకులు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చును.
వీటిలో బుల్లెట్ 350, క్లాసిక్ 350, హంటర్ 350, గోన్ క్లాసిక్ 350, న్యూ మీటర్ 350 వంటి మాడళ్లు ఫ్లిప్‌కార్ట్‌లో లభించనున్నాయి. ప్రస్తుతానికి ఈ బైకులు కేవలం ఐదు నగరాలు బెంగళూరు, గురుగ్రామ్, కోల్‌కతా, లఖ్నోలో మాత్రమే ఈ నెల 22 నుంచి లభించనున్నట్టు ప్రకటించాయి. బైకు కొనుగోలుతర్వాత ఆయా నగరాల్లో ఉన్న రాయల్ ఎన్ఫిల్డ్ డీలర్ల వద్ద సర్విసింగ్, సేవలు పొందవచ్చునని తెలిపింది.