ఇక వర్క్ ఫ్రం ఆఫీస్!

- మెజార్టీ ఐటీ కంపెనీలది ఇదే అభిప్రాయం
- హైసియా ఫ్యూచర్ వర్క్ మోడల్ సర్వేలో వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఐటీ రంగ సంస్థలు ఈ ఏడాదిలోనే వర్క్ ఫ్రం ఆఫీస్ విధానాన్ని తిరిగి ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నాయని హైసి యా (హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్) సర్వేలో తేలింది. ‘ఫ్యూచర్ వర్క్ మోడల్’ పేరిట నిర్వహించిన ఈ సర్వేలో చిన్నతరహా కంపెనీలు ఇప్పటికే 20% ఉద్యోగులతో వర్క్ ఫ్రం ఆఫీస్‌ను ప్రారంభించినట్లు స్పష్టమైంది. ఇక ప్రస్తుత గ్లోబల్ ట్రెండ్స్‌కి అనుగుణంగా హైబ్రిడ్ విధానంలో పని చేయించేందుకు 70% కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఈ ఏడాది డిసెంబర్ నాటికి 73% కంపెనీలు కనీసం 10-50% మందితో వర్క్ ఫ్రం ఆఫీస్ ప్రారంభించాలని యోచిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చికల్లా 79% కంపెనీలు గరిష్ఠంగా 90% ఉద్యోగులతో వర్క్ ఫ్రం ఆఫీస్ ప్రారంభించాలని అనుకుంటున్నా యి. తమ ఉద్యోగులు కనీసం ఒక్క డోసు వ్యాక్సినైనా తీసుకునే ఉండొచ్చని 84% కంపెనీలు భావిస్తునట్లు తాజా హైసియా సర్వేలో వెల్లడైంది.
వ్యాక్సిన్ సర్టిఫికేట్ ఉండాల్సిందే
ఉద్యోగాల భర్తీలో వ్యాక్సిన్ సర్టిఫికేట్ అడిగే అవకాశం ఉంటుందని కంపెనీలు అభిప్రాయపడ్డాయి. వ్యాక్సినేషన్ ఎక్కువగా ఉంటే ఆఫీస్‌కు వచ్చే ఉద్యోగుల్లో ైస్థెర్యాన్ని నింపుతుందన్నాయి. ఇక పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలను కొనసాగించాలని సూచించాయి. కాగా, సెజ్‌ల్లో ఉన్న కంపెనీల్లో వర్క్ ఫ్రం ఎనీవేర్‌ను ప్రభుత్వం అనుమతించాలని కంపెనీలు కోరాయి.
అధిక జీతాలతో దెబ్బే: ఇక్రా
ఈ ఆర్థిక సంవత్సరం ఐటీ కంపెనీలకు 9-12 శాతం రెవిన్యూ వృద్ధికి వీలున్నా.. అధిక వేతనాలతో లాభాలు తగ్గవచ్చని మంగళవారం ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ ఉపాధ్యక్షుడు గౌరవ్ జైన్ అంచనా వేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

