Retail Inflation | తగ్గిన ఆహార ధరలు.. జనవరిలో 4.31 శాతానికి దిగొచ్చిన రిటైల్ ద్రవ్యోల్బణం..!
Retail Inflation | భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. ఆహార వస్తువుల ధరలు తగ్గిపోవడంతో 2024 డిసెంబర్ నెలతో పోలిస్తే 2025 జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 శాతానికి పరిమితమైంది.
Retail Inflation | భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. ఆహార వస్తువుల ధరలు తగ్గిపోవడంతో 2024 డిసెంబర్ నెలతో పోలిస్తే 2025 జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 శాతానికి పరిమితమైంది. గతేడాది డిసెంబర్ నెలలో 5.22 శాతంగా నమోదైంది. గ్రామీణ ద్రవ్యోల్బణం 5.76 (డిసెంబర్) నుంచి 4.64 శాతానికి, పట్టణ ద్రవ్యోల్బణం 4.58 శాతం (డిసెంబర్) నుంచి 3.87 శాతానికి పతనమైంది.
రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం మరోమారు ఆర్బీఐ తన రెపోరేట్ తగ్గింపునకు మార్గం సుగమం చేసింది. దాదాపు ఐదేండ్ల తర్వాత ఇటీవల జరిగిన ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ తన రెపోరేట్ 6.50 శాతం నుంచి 6.25 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం కూడా వినియోగాన్ని పెంపొందించేందుకు ఆదాయం పన్ను శ్లాబ్‌ల్లో కోతలు విధిస్తూ ఈ నెల ఒకటో తేదీన బడ్జెట్లో ప్రకటించింది.
అంతకు ముందు అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరుకుని 14 నెలల గరిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. 10.9 శాతంతో ఆహార ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్టానికి దూసుకెళ్లింది. డిసెంబర్ ఆహార ద్రవ్యోల్బణం 8.39 శాతం నుంచి 6.02 శాతానికి పతనమైంది. గతేడాది ఆగస్టు తర్వాత ఇదే అత్యంత కనిష్టం. కూరగాయల ధరలు డిసెంబర్లో 26.6 శాతం ఉంటే, గత నెలలో 11.35 శాతానికి దిగి వచ్చాయి. తృణ ధాన్యాల ధరలు 6.50 నుంచి 6.24 శాతానికి, పప్పు దినుసుల ధరలు 3.80 శాతం నుంచి 2.59 శాతానికి పతనం అయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

