వడ్డీరేట్ల తగ్గింపునకు వేళాయె.. వచ్చేవారంలో రిజర్వ్ బ్యాంక్ పరపతి సమీక్ష
రుణ గ్రహీతలకు భారీ ఊరట లభించబోతున్నది. వచ్చేవారంలో జరగబోయే ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ప్రకటించనున్న పరపతి విధానంలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే ఆస్కారం ఉండటంతో రెపోరేటు 5.25 శాతానికి దిగిరానున్నదని అత్యధిక మంది ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు.
- ఈసారి రెపో రేటును పావు శాతం తగ్గించే అవకాశం
న్యూఢిల్లీ, నవంబర్ 29 : రుణ గ్రహీతలకు భారీ ఊరట లభించబోతున్నది. వచ్చేవారంలో జరగబోయే ద్రవ్యపరపతి సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయన్న అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న ప్రకటించనున్న పరపతి విధానంలో వడ్డీరేట్లను పావు శాతం తగ్గించే ఆస్కారం ఉండటంతో రెపోరేటు 5.25 శాతానికి దిగిరానున్నదని అత్యధిక మంది ఆర్థికవేత్తలు అంచనావేస్తున్నారు. అయినప్పటికీ వచ్చే ఏడాది మాత్రం తగ్గింపు అవకాశాలు లేవని వారు స్పష్టంచేస్తున్నారు. ధరల సూచీ మునుపెన్నడూలేని స్థాయికి తగ్గడంతో సెంట్రల్ బ్యాంక్‌కు వడ్డీరేట్ల తగ్గింపునకు అవకాశాలు మరింత సులువుకానున్నాయి. గత నెలకుగాను ధరల సూచీ ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ 0.25 శాతానికి పరిమితమైంది.
ఈ నేపథ్యంలో తాజాగా టోకు ధరల సూచీ కూడా 27 నెలల కనిష్ఠాన్ని తాకుతూ అక్టోబర్‌లో మైనస్ 1.21 శాతానికి దిగింది. దీంతో ఇప్పుడు రాబోయే ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లకు తప్పక కోతలు పెడుతుందన్న అంచనాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. మరోవైపు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వ్యాఖ్యలు కూడా వడ్డీరేట్ల తగ్గింపునకు బలోపేతాన్ని ఇస్తున్నాయి. ప్రస్తుతేడాదిలో ఇప్పటివరకు రెపోరేటును ఆర్బీఐ 1 శాతం (100 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. అయితే గత రెండు ద్రవ్యసమీక్షల్లో రేట్ల కోతలకు రిజర్వ్ బ్యాంక్ దూరంగానే ఉంటూ వస్తున్నది. దీంతో ఈసారి కోత ఖాయమనే అత్యధికులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ రెపోరేటు 5.50 శాతంగా ఉన్న సంగతి విదితమే.
ఫెడ్ వడ్డీరేట్ల కోతతో..
అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను క్రమంగా తగ్గిస్తుండటంతో రిజర్వ్ బ్యాంక్ కూడా రేట్లలో కోత పెట్టక పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ తగ్గించకపోతే ఇక్కడ పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందన్న భయాలు నెలకొన్నాయి. దీంతో రిజర్వ్ బ్యాంక్..ఫెడ్ తీసుకునే నిర్ణయం ఆధారంగా ఇక్కడ వడ్డీరేట్లను తగ్గిస్తూ వస్తున్నది. మరోవైపు, ఆర్థిక వేత్తలు విభిన్నంగా తమ అంచనాలను వ్యక్తంచేశారు. వచ్చే సమీక్షలో పావు శాతం తగ్గించవచ్చని కొందరు అంచనా వేయగా..మరికొందరు మాత్రం యథాతథానికి మొగ్గుచూపే అవకాశాలున్నాయన్నారు.
తగ్గనున్న ఈఎంఐల భారం
ఈ ఏడాది ఆరంభంతో పోల్చితే ఇప్పుడు బ్యాంక్ రుణాలపై వడ్డీరేట్లు తక్కువగా ఉన్నాయి. వచ్చే ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ రెపోరేటును తగ్గిస్తే ఇంకా తగ్గనున్నాయి. దీంతో రుణగ్రహీతలపై ఈఎంఐల భారం మరింత దిగిరానున్నది. ఇదే జరిగితే వాహన, గృహ, కన్జ్యూమర్ గూడ్స్ తదితర రంగాలకు గొప్ప ఉత్సాహమేనని చెప్పవచ్చు. ఆయా ప్రధాన రంగాలతోపాటు, వాటి అనుబంధ రంగాల్లోనూ ఉత్పత్తి, వినిమయం పెరుగుతాయని వ్యాపారులు చెప్తున్నారు. దీనివల్ల ఉద్యోగ-ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని, అంతిమంగా దేశ ఆర్థిక వృద్ధిరేటు పరుగులు పెట్టగలదని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అలాగే ఈసారి రెపోరేటుకు ఆర్బీఐ కోత పెడితే.. బ్యాంకులు కూడా ఆ మేరకు తగ్గించేలా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని, దానివల్ల ఇంకా సత్ఫలితాలుంటాయని ఇండస్ట్రీ వర్గాలు సూచిస్తున్నాయి. రిటైల్ రుణాలపై వడ్డీరేట్లు తగ్గితే అమ్మకాలు పెరుగుతాయని చెప్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

