Shaktikanta Das | మేము ఎవ్వరినీ ఫాలో అవ్వబోం.. క్రిప్టోలపై మా వైఖరి మాది: ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
మేము ఎవ్వరినీ ఫాలో అవ్వబోమంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్. రెగ్యులేషన్స్‌కు వచ్చేటప్పుడు సొంత నిర్ణయాలే తప్ప, వాళ్లను.. వీళ్లను అనుకరించేది లేదని స్పష్టం చేశారు.
- రెగ్యులేషన్ల విషయంలో ఇతరులను అనుకరించం
- ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం
Shaktikanta Das | ముంబై, జనవరి 11: మేము ఎవ్వరినీ ఫాలో అవ్వబోమంటున్నారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్. రెగ్యులేషన్స్‌కు వచ్చేటప్పుడు సొంత నిర్ణయాలే తప్ప, వాళ్లను.. వీళ్లను అనుకరించేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే క్రిప్టోకరెన్సీలపై మా వైఖరి మాదని కుండబద్దలు కొట్టేశారు. క్రిప్టోలపై మాకున్న అభిప్రాయం, నిర్ణయాల్లో మార్పు లేదని తేల్చి చెప్పారు. బిట్‌కాయిన్ ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)కు అమెరికా రెగ్యులేటర్లు అనుమతినిచ్చిన నేపథ్యంలో దాస్ పైవిధంగా స్పందించారు. ‘మరో మార్కెట్‌కు మంచిదనిపించింది.. మనకు మంచిది కానవసరం లేదు. అందువల్ల మన అభిప్రాయాలు మనవి. ఈ విషయంలో ఆర్బీఐది, నాది ఒకేమాట’ అన్నారు.
గురువారం ఇక్కడ ప్రముఖ జాతీయ వ్యాపార దినపత్రిక మింట్ నిర్వహించిన బీఎఫ్ఎస్ఐ సెమినార్‌కు దాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాలకైనా, అభివృద్ధి చెందిన దేశాలకైనా క్రిప్టోకరెన్సీలు పెను ప్రమాదమేనని వ్యాఖ్యానించారు. క్రిప్టోలు దేశ ఆర్థిక స్థిరత్వాన్నే ప్రశ్నార్థకం చేస్తాయని చెప్పుకొచ్చారు. నిజానికి అమెరికా క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ ఎస్ఈసీ సైతం క్రిప్టోల విషయంలో జాగ్రత్తని మదుపరులను హెచ్చరించినట్టు గుర్తుచేశారు. ‘ఇతర దేశాల రెగ్యులేటర్లు ఏం చేశారన్న దానిపై నేను మాట్లాడదల్చుకోలేదు. వారి దేశానికి ఏది ఉత్తమమో వారికి తెలుసు. అయితే నా వరకు నేను చెప్తున్నదేమిటంటే దానితో జాగ్రత్త’ అని క్రిప్టోలనుద్దేశించి దాస్ హితవు పలికారు. ఈ క్రిప్టో మానియా సరికాదని కూడా చెప్పారు.
యూపీఐ అత్యుత్తమం
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లేదా యూపీఐ.. ప్రపంచంలోనే అత్యుత్తమ చెల్లింపుల వ్యవస్థని ఆర్బీఐ గవర్నర్ దాస్ అన్నారు. దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు పెద్ద ఎత్తున విజయవంతమయ్యాయని చెప్పారు. ఈ క్రమంలోనే గతకొద్ది నెలలుగా యూపీఐ, దాని సృష్టికర్త నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ)పై వస్తున్న విమర్శల్ని ఆయన కొట్టిపారేశారు. డిజిటల్ పేమెంట్స్ రంగంలో ఎన్పీసీఐ గుత్తాధిపత్యం చలాయిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో నిజానికి ఎన్‌పీసీఐకి పోటీగా ఇతర యాప్‌ల పరిచయానికి దరఖాస్తుల్ని ఆహ్వానించామని, కానీ ఇప్పటిదాకా ఒక్కటీ రాలేదని దాస్ వెల్లడించారు. కాగా, చాలా నెలల కిందటే దేశంలో యూపీఐ లావాదేవీల సంఖ్య 100 బిలియన్ల మార్కును దాటింది. సింగపూర్, యూఏఈల్లోనూ యూపీఐ సేవలు నడుస్తున్నాయి. మరికొన్ని దేశాల్లోనూ దీని రాకకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
Shamonda Virus: షామోండా వైరస్‌తో మనుషులకు, పశువులకు రిస్క్ ఏంటి ?
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

