Tesla | భారత్‌లో భారీ పెట్టుబడులకు టెస్లా రెడీ : దిగుమతి సుంకం తగ్గింపుపై పట్టు
భారత్‌లో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ తయారీ దిగ్గజం టెస్లా (Tesla) అందుకు ఓ మెలిక పెట్టింది.
న్యూఢిల్లీ : భారత్‌లో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ తయారీ దిగ్గజం టెస్లా (Tesla) అందుకు ఓ మెలిక పెట్టింది. భారత్‌లో రెండేండ్ల పాటు తన ఆపరేషన్స్‌కు దిగుమతి చేసుకునే వాహనాలపై తక్కువ కన్సెషనల్ సుంకాలకు అనుమతిస్తేనే భారీ పెట్టుబడులకు ముందుకొస్తామని టెస్లా పేర్కొంది. భారత్‌లో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు టెస్లా కొంతకాలంగా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. తొలి రెండేండ్లలో దిగుమతి చేసుకున్న తమ వాహనాలపై 15 శాతం కన్సెషనల్ డ్యూటీకి ప్రభుత్వం ఆమోదిస్తే 200 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని టెస్లా పేర్కొంది.
ఈ దిశగా సమగ్ర ప్రతిపాదనతో టెస్లా ప్రభుత్వాన్ని సంప్రదించింది. భారత్‌లో తమ పెట్టుబడుల వివరాలు, తక్కువ సుంకంపై ఎన్ని కార్లను దిగుమతి చేస్తుందనే వివరాలను ప్రభుత్వం ముందుంచింది. టెస్లా ప్రతిపాదన సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. కన్సెషనల్ టారిఫ్‌పై దిగుమతి చేసే కార్ల సంఖ్యను టెస్లా ప్రతిపాదన కంటే కుదించాలని ప్రభుత్వం కోరుకుంటోందని ఓ వార్తా సంస్ధ నివేదిక వెల్లడించింది. భారత్ ప్రస్తుతం 40,000 డాలర్లకు పైబడిన కార్లపై 100 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తుండగా అంతకంటే తక్కువ ధర పలికే కార్లపై 70 శాతం దిగుమతి సుంకం వసూలు చేస్తోంది.
దిగుమతి సుంకంతో పాటు ఆయా కంపెనీల నుంచి ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీలను కోరుతోంది. కాగా, బ్యాంక్ గ్యారంటీపై ప్రభుత్వం తమను ఒత్తిడి చేయరాదని కూడా టెస్లా కోరుతున్నట్టు సమాచారం. మరోవైపు టెస్లా భారత్ ఆపరేషన్స్‌ను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతుండగా మోడల్ 3, మోడల్ వై కార్లను లాంఛ్ చేస్తోంది. కన్సెషనల్ ఇంపోర్ట్ డ్యూటీకి అనుమతిస్తే భారత్‌లో మోడల్ 3, మోడల్ వై కార్లు వరుసగా రూ. 38 లక్షలు, రూ. 43 లక్షలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Read More :
Israel-Hamas War | నేటి నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ.. బందీల విడుదల ప్రారంభం
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

