Jio Recharge Plan | డేటా లేకుండా 364 రోజుల వ్యాలిడిటీతో.. రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్స్..!
Jio Recharge Plan | గత కొద్దిరోజుల కింద ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలను కాలింగ్, ఎస్ఎంఎస్తో చౌక రీచార్జ్ ప్లాన్‌ను అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్తో రెండు చౌకైన ప్లాన్స్‌ని పరిచయం చేసింది. అ రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్స్‌ని జాబితా చేసింది.
Jio Recharge Plan | గత కొద్దిరోజుల కింద ట్రాయ్ అన్ని టెలికాం కంపెనీలను కాలింగ్, ఎస్ఎంఎస్తో చౌక రీచార్జ్ ప్లాన్‌ను అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ట్రాయ్ ఆదేశాల నేపథ్యంలో కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్తో రెండు చౌకైన ప్లాన్స్‌ని పరిచయం చేసింది. అ రెండు వాయిస్ ఓన్లీ ప్లాన్స్‌ని జాబితా చేసింది. దాంతో వినియోగదారులు ఒకసారి రీచార్జ్ చేస్తే 365 రోజు దీర్ఘకాలిక వ్యాలిడిటీని పొందనున్నారు. ఈ ప్లాన్ డేటాను ఉపయోగించని యూజర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. జియో ఈ ప్లాన్‌ను కేవలం కాలింగ్, ఎస్ఎంఎస్ ఉపయోగిస్తూ.. డేటా అవసరం లేని యూజర్లను దృష్టిలో పెట్టుకొని తీసుకువచ్చింది. ఈ రెండు ప్లాన్ల విషయానికి వస్తే రూ.458కి 84 రోజుల వ్యాలిడిటీ.. రూ.1958కే 365 రోజులు చెల్లుబాటుతో వస్తుంది. జియో ఈ రెండు ప్లాన్లలో వినియోగదారులు చాలా ప్రయోజనాలుంటాయి.
84 రోజుల జియో ప్లాన్
జియో కొత్త రూ.458 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో, వినియోగదారులకు అపరిమిత కాలింగ్, 1000 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దాంతో పాటు యూజర్లు జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు కూడా ఉచిత యాక్సెస్ పొందుతారు. ఈ ప్లాన్ ప్రత్యేకంగా కాలింగ్, ఎస్ఎంఎస్ని ఉపయోగించే వినియోగదారుల కోసం మాత్రమే తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాల్స్, ఉచిత రోమింగ్ సౌకర్యం ఉంటుంది.
365 రోజుల ప్లాన్
జియో కొత్త రూ.1958 ప్రీపెయిడ్ ప్లాన్ 365 రోజుల దీర్ఘకాలిక చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌లోనైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. దాంటో పాటు 3600 ఉచిత ఎస్ఎంఎస్లు, ఉచిత జాతీయ రోమింగ్ సౌకర్యం ఉంటుంది. అలాగే, ఈ ప్లాన్‌లో జియో సినిమా, జియో టీవీ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. తద్వారా వినియోగదారులు వినోదం సైతం పొందుతారు.
రెండుప్లాన్స్ను తొలగించిన జియో..
జియో పాత రీఛార్జ్ ప్లాన్లలో రెండింటిని జాబితా నుంచి తొలగించింది. ఈ ప్లాన్లు రూ.479.. రూ.1899.. రూ.1899 ప్లాన్ 336 రోజుల చెల్లుబాటుతో 24జీబీ డేటాను అందించగా.. రూ.479 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో 6జీబీ డేటాను అందించిన విషయం తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

