Redmi 14C | రెడ్మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. రెడ్మీ 14సీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Redmi 14C | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ ధర రూ.9,999 నుంచి మొదలవుతుంది.
Redmi 14C | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) తన రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్ గ్లాస్ బ్యాక్ తోపాటు మూడు రంగుల ఆప్షన్లతో వస్తోంది. 6.88-అంగుళాల డిస్ ప్లే విత్ 120హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్, 5,160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8- మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.9,999, 4జీబీ ర్యామ్ విత్ 128జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.10,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.11,999లకు లభిస్తుంది. స్టార్ లైట్ బ్లూ, స్టార్ డస్ట్ పర్పుల్, స్టార్ గేజ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఎంఐ.కాం, షియోమీ రిటైల్ స్టోర్ల నుంచి రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్ విక్రయిస్తారు.
రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్ ఆండ్రాయిడ్ 14బేస్డ్ హైపర్ ఓఎస్ స్కిన్ వర్షన్‌పై పని చేస్తుంది. రెండేండ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, నాలుగేండ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ అందించనున్నది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.88 అంగుళాల హెచ్డీ+ పిక్సెల్స్ ఎల్సీడీ రిజొల్యూషన్ ఉంటుంది. 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ 4ఎన్ఎం స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఫోన్ ర్యామ్ 12 జీబీ వరకూ వర్చువల్‌గా పెంచుకోవచ్చు. మైక్రో ఎస్డీకార్డ్ సాయంతో స్టోరేజీ కెపాసిటీ ఒక టిగా బైట్ వరకూ పొడిగించుకోవచ్చు.
రెడ్మీ 14సీ 5జీ (Redmi 14C 5G) ఫోన్ బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైదూ, వై-ఫై, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. అంబియెంట్ లైట్ సెన్సర్, యాక్సిలరోమీటర్ వర్చువల్ ప్రాగ్జిమిటీ సెన్సర్, ఈ-కంపాస్ ఉంటాయి. 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5,160 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. రూ.1,999 ధర గల 33వాట్ల ఇన్ బాక్స్ చార్జర్ కూడా అందిస్తారు. సింగిల్ చార్జింగ్‌తో స్టాండ్‌బై టైంగా 21 రోజులు, గరిష్టంగా 139 గంటలు మ్యూజిక్ ప్లే బ్యాక్ టైం బ్యాటరీ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

