న్యూఢిల్లీ, అక్టోబర్ 2: గిలీడ్ సైన్సెస్ ఐర్లాండ్ యూసీతో హైదరాబాదీ ఔషధ రంగ సంస్థలు డాక్టర్ రెడ్డీస్, హెటిరో జట్టు కట్టాయి. హెచ్ఐవీ చికిత్సలో వినియోగించే లెనకాపవిర్ డ్రగ్ తయారీ, మార్కెటింగ్ కోసం ఇరు కంపెనీలు గిలీడ్‌తో నాన్-ఎక్స్‌క్లూజివ్, రాయల్టీ-ఫ్రీ వాలంటరీ లైసెన్సింగ్ ఒప్పందాలను చేసుకున్నాయి. భారత్‌తోపాటు మరో 120 దేశాల్లో ఈ భాగస్వామ్యాలు కొనసాగుతాయి. ఈ మేరకు బుధవారం విడుదల చేసిన ప్రకటనల్లో రెడ్డీస్, హెటిరో కంపెనీలు తెలియజేశాయి. లెనకాపవిర్కు అమెరికా ఔషధ నియంత్రణ మండలి ఆమోదం ఉన్నది. అయినప్పటికీ ఎయిడ్స్‌ను నిరోధించడంలో లెనకాపవిర్ పనితీరును ఇంకా ప్రపంచ దేశాలు గుర్తించాల్సి ఉన్నది.