రికవరీ ప్రక్రియకు చమురు ధరల షాక్

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు సరికొత్త శిఖరాలకు చేరుతుండటం భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకునే ప్రక్రియను దెబ్బతీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ లీటర్‌కు రూ 100 దాటడంతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. డీజిల్ ధరలు కూడా సెంచరీకి చేరువై చెమటలు పట్టిస్తున్నాయి.కరోనా సెకండ్ వేవ్‌తో తల్లడిల్లుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు రికార్డు స్ధాయికి చేరిన చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. పెట్రో ధరలు వాహనదారులనే కాకుండా సామాన్యులనూ వణికిస్తున్నాయి. డీజిల్ ధరల పెరుగుదలతో సరుకు రవాణా వ్యయం భారమై నిత్యావసరాలు సహా అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగి వస్తువులు, సేవల ధరలు పౌరులకు భారంగా పరిణమించాయి. మరోవైపు పెట్రో ధరలు ఇలాగే పెరిగితే చమురు దిగుమతులపై ఆధారపడిన క్రమంలో చెల్లింపుల సమస్య ఎదురవుతుందనే ఆందోళనకు తోడు ధరల పెంపుతో వినిమయం తగ్గితే ప్రభుత్వానికి రాబడి పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెట్రో ఉత్పత్తులపై కొంత మేర పన్నుల భారం తగ్గించి ఇంధన ధరలు దిగివచ్చేలా చేయడం మేలని సూచిస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

