Stocks | రెపోరేట్ తగ్గింపు మెచ్చని ఇన్వెస్టర్లు.. మూడో సెషన్లోనూ నష్టాలతో ముగిసిన స్టాక్స్..!
Stocks | ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నా ఇన్వెస్టర్లకు నచ్చకపోవడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 197.97 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 23,560 పాయింట్ల వద్ద ముగిసింది.
Stocks | వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షలో నిర్ణయం తీసుకున్నా ఇన్వెస్టర్లకు నచ్చలేదు. అంచనాలకు అనుగుణంగా రెపోరేట్ 25 బేసిక్ పాయింట్లు తగ్గిస్తూ.. ద్రవ్య పరపతి సమీక్షలో ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నా స్టాక్స్‌పై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఫలితంగా వరుసగా సెన్సెక్స్ మూడో రోజు పతనమైంది. శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్ 198 పాయింట్ల నష్టంతో 77,860 పాయింట్ల వద్ద స్థిర పడింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 78,357 పాయింట్ల గరిష్టానికి దూసుకెళ్లింది. తిరిగి 77,476 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో దాదాపు 900 పాయింట్లు సెన్సెక్స్ పతనమైంది. మూడు సెషన్లలో నష్టపోయినా శుక్రవారం వారాంతంలో 354 పాయింట్ల లాభాల్లోనే ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ ఇంట్రాడే ట్రేడింగ్‌లో 23,694 – 23,443 పాయింట్ల మధ్య తచ్చాడింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 23,560 పాయింట్ల వద్ద ముగిసింది.
బీఎస్ఈ- 30 సెన్సెక్స్‌లో ఐటీసీ 4.5 శాతం లాభ పడింది. భారతీ ఎయిర్టెల్ మూడో త్రైమాసికంలో ఐదు రెట్లు నికర లాభం వృద్ధి చెందడంతో 3.5 శాతం లబ్ధితో ముగిసింది. ఇంకా జొమాటో, మహీంద్రా అండ్ మహీంద్రా, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ తదితర స్టాక్స్ లాభాలతో ముగిశాయి. మరోవైపు ఎస్బీఐ రెండు శాతానికి పైగా నష్టపోగా, అదానీ పోర్ట్స్, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్ గ్రిడ్ భారీగా నష్టపోయాయి.
ఎన్ఎస్ఈ నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్‌లు సుమారు.1.5 శాతం చొప్పున నష్టపోయాయి. ఆయిల్ అండ్ గ్యాస్ ఒకశాతం నష్టపోతే, నిఫ్టీ మెటల్ ఇండెక్స్ రెండు శాతానికి పైగా లాభ పడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ స్వల్ప లాభంతోనూ, స్మాల్ క్యాప్ స్వల్ప నష్టాలతో ముగిశాయి.
ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో మార్కెట్లు నష్టాలతో ముగిస్తే, షాంఘై, హాంకాంగ్ లాభాలతో స్థిర పడ్డాయి. యూరోపియన్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అమెరికా మార్కెట్లు గురువారం లబ్ధి పొందాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌పై 0.73 శాతం వృద్ధి చెంది 74.83 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి గురువారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.3,549.95 కోట్ల విలువైన పెట్టుబడులు ఉపసంహరించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NASA Astronauts: భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో .. ఓటేసిన నాసా ఆస్ట్రోనాట్లు.. వీడియో
ధాన్యం అమ్ముకునేందుకు పొలానికి.. రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని రైతు మృతి
Allu Aravind | హీరోగా అల్లు అరవింద్,హీరోయిన్గా జయసుధ.. సినిమా టైటిల్ కూడా చెప్పేశారు!
ఎడతెరిపి లేని వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు.. భద్రాద్రి జిల్లాలో జలమయమైన రహదారులు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

