హైదరాబాద్, ఫిబ్రవరి 26: ప్రముఖ సిమెంట్ ఉత్పత్తి సంస్థ దాల్మియా సిమెంట్ తాజాగా బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్‌ను ప్రచారకర్తగా నియమించుకున్నది. తన బ్రాండ్‌ను మరింత ప్రచారం చేయడానికి రూఫ్ కాలమ్ ఫౌండేషన్(ఆర్సీఎఫ్) కొత్త బ్రాండ్‌కు ఆయన ప్రచారం చేయనున్నారు.
ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో పునీత్ దాల్మాయా మాట్లాడుతూ..గత ఎనిమిది దశాబ్దాలుగా దేశీయ సిమెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్టు, మా కొత్త బ్రాండ్‌తో రాబోయే తరాలకు ఒక గొప్ప గృహాన్ని నిర్మించడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 80 ఏండ్లకు పైగా చరిత్ర కలిగిన దాల్మియా సిమెంట్‌కు ప్రచారకర్తగా ఉండటం చాలా సంతోషంగా ఉన్నదని రణ్వీర్ సింగ్ ఈ సందర్భంగా తెలిపారు.