న్యూఢిల్లీ, జూన్ 18: దేశీయ టెలికాం రంగ సంస్థ భారతీ ఎయిర్టెల్ కార్పొరేట్ అఫైర్స్ డైరెక్టర్, గ్రూప్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రాహుల్ వాట్స్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చీఫ్ రెగ్యులేటరీ ఆఫీసర్ రవీ గాంధీ వైస్ చైర్‌పర్సన్‌గా ఉండనున్నారు. ఈ మేరకు సీవోఏఐ గురువారం ప్రకటించింది.
గత ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను సీవోఏఐ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. ఈ క్రమంలోనే కొత్త నాయకత్వాన్ని ఖరారు చేసింది. అలాగే టెలికాం రంగంలో వస్తున్న మార్పులపైనా చర్చ జరిగింది.