క్యూజాబ్స్ జోరు

- 20 లక్షలకు యూజర్ల సంఖ్య
- టాప్-5 నగరాల్లో హైదరాబాద్
ముంబై, జనవరి 24: ఆన్లైన్ జాబ్ సెర్చింగ్ యాప్, ట్రైనీ-నైపుణ్య ఉద్యోగార్థుల రిక్రూట్మెంట్ వేదిక.. క్యూజాబ్స్ యూజర్ల సంఖ్య 20 లక్షలను దాటింది. కేవలం 100 రోజుల రికార్డు సమయంలోనే 10 లక్షల యూజర్లు పెరగడం గమనార్హం. సంస్థలు, చిన్న-మధ్యతరహా వ్యాపారుల నుంచి పండుగ సీజన్ డిమాండ్ ఉండటంతో గతేడాది అక్టోబర్-డిసెంబర్లో క్యూజాబ్స్పై ఉద్యోగాల సంఖ్య కూడా రెట్టింపునకుపైగా పెరగడం గమనార్హం. కాగా, డెలివరీ, బీపీవో/కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ/బ్యాక్ ఆఫీస్, ఫీల్డ్ సేల్స్, డ్రైవర్ విభాగాల్లో డిమాండ్ ఎక్కువగా ఉన్నట్టు క్యూజాబ్స్ సోమవారం తెలిపింది. ఈ ఉద్యోగాల ఖాళీల్లో బెంగళూరు కంపెనీలు 23 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, ఢిల్లీ 18 శాతంతో రెండో స్థానంలో ఉన్నది. హైదరాబాద్ 15 శాతంతో మూడో స్థానంలో ఉంటే, ముంబై 11 శాతం, పుణె 8 శాతంతో టాప్-5లో చివరి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇటు ఉద్యోగార్థులు, అటు సంస్థల విశ్వాసం ఉన్నందునే ఇంత ఆదరణను అందుకోగలుగుతున్నామని క్వెస్ కార్ప్ ప్రెసిడెంట్ శేఖర్ గరిస తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

