Kurl-on | న్యూఢిల్లీ, జూలై 17: ప్రముఖ మ్యాట్రెస్ బ్రాండ్ కర్లాన్.. షీలా ఫోమ్ వశమవుతున్నది. కర్లాన్ ఎంటర్‌ప్రైజెస్‌లో రూ.2,035 కోట్లతో 94.66 శాతం వాటాను కొంటున్నట్టు సోమవారం షీలా ఫోమ్ తెలియజేసింది. మరోవైపు రూ.300 కోట్లతో ఆన్లైన్ ఫర్నీచర్ సంస్థ హౌజ్ ఆఫ్ కీరయా ప్రైవేట్ లిమిటెడ్‌లో 35 శాతం వాటానూ షీలా కొనుగోలు చేస్తున్నది.