Poco M6 Pro 5G | త్వరలో భారత్ మార్కెట్లోకి పొకో ఎం6 ప్రో 5జీ.. ఇవీ డిటైల్స్..?!
Poco M6 Pro 5G | షియోమీ సబ్ బ్రాండ్ పొకో.. భారత్ మార్కెట్లో పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది. ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 810 ఎస్వోసీ చిప్సెట్తో వస్తోంది.
Poco M6 Pro 5G | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో.. త్వరలో భారత్ మార్కెట్లో తన ‘పొకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G)’ కొత్త ఫోన్ ఆవిష్కరిస్తామని ప్రకటించింది. షియోమీ సబ్ బ్రాండ్ పొకో.. తన పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ డిజైన్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈఫోన్ సియాన్ కలర్ ఆప్షన్‌తో డ్యుయల్ కెమెరా సెటప్‌తో వస్తున్నది. గతేడాది ఫిబ్రవరిలో ఆవిష్కరించిన పొకో ఎం4 ప్రో 5జీ ఫోన్ కొనసాగింపుగా పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ వస్తున్నది. రెక్టాంగుల్ షేప్డ్ కెమెరా మాడ్యూల్, డ్యుయల్ టోన్ డిజైన్‌తో పొకో ఎం6 ప్రో 5జీ ఫోన్ వస్తున్నది.
పొకో ఎం4 ప్రో 5జీ ఫోన్ 4జీబీ రామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999, 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.16,999, టాప్ హై ఎండ్ ఫోన్ 8జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 పలుకుతుంది.
పొకో ఎం6 5జీ ఫోన్ 6.6-అంగుళాల ఫుల్ హెచ్డీ + డాట్ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది ఒక్టాకోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 810 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ షూటర్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ ఉన్నా మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ పెంచుకోవచ్చు. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 33 వాట్ల ప్రో ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

