Poco M6 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో (Poco) తన పొకో ఎం6 5జీ (Poco M6 5G) ఫోన్ త్వరలో భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించనున్నది. రెడ్ మీ13సీ 5జీ ఫోన్‌ను రీబ్రాండ్ చేసి మార్కెట్లోకి తేవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ నెల ఆరో తేదీన షియోమీ అనుబంధ సంస్థ రెడ్మీ తన రెడ్మీ13సీ 5జీ ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.
రెడ్మీ 13సీ 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌తోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐయూఐ 14 వర్షన్‌పై ఈ ఫోన్ పని చేస్తుంది. 6.74 అంగుళాల ఎల్సీడీ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటది.
డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో రెడ్మీ 13సీ ఫోన్ వస్తున్నది. డెప్త్ సెన్సర్‌తోపాటు 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఎఫ్/1.8 అపెర్చర్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది. 18 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.