Poco C61 | పోకో నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ పోకో సీ61.. ధరెంతంటే..!
Poco C61 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో తన బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ పోకో సీ61 ఫోన్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Poco C61 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పోకో (Poco) మరో బడ్జెట్ ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. పోకో సీ61 (Poco C61) పేరుతో వస్తున్న ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ36 (Media Tek G36) ప్రాసెసర్‌తో పని చేస్తుంది. గత నెలలో ఆవిష్కరించిన రెడ్మీ ఏ3 (Redmi A3) ఫోన్‌ను రీబ్రాండ్ చేసి పోకో సీ61 (Poco C61) ఫోన్ ఆవిష్కరించినట్లు తెలుస్తున్నది. 10వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బ్యాక్డ్ 8-మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా యూనిట్, రెండు ర్యామ్లూ రెండు స్టోరేజీ వేరియంట్లతోపాటు మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఈ నెలాఖరు నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. పోకో సీ61 ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.6,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.7,999 పలుకుతుంది. ఈ నెల 28 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా విక్రయాలు ప్రారంభం అవుతాయి. డైమండ్ డస్ట్ బ్లాక్. ఎథరల్ బ్లూ, మైస్టికల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఫోన్ సొంతం చేసుకోవచ్చు.
పోకో సీ61 (Poco C61) ఫోన్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్3 ప్రొటెక్షన్‌తోపాటు 6.71 ఎల్ సీడీ హెచ్డీ+ (1650 x 720 పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ ప్లే కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మీడియాటెక్ హెలియో జీ36 ఎస్వోసీ (Media Tek Helio G36 Soc) ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటది. ఏఐ బ్యాక్డ్ డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్ ఉంటుంది. 8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, అన్ స్పెసిఫైడ్ సెకండరీ సెన్సర్ విత్ ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
పోకో సీ61 ఫోన్ 10వాట్ల వైర్డ్ చార్జింగ్ మద్దతుతోపాటు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. డ్యుయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ, బయో అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

