Personal Loans | వ్యక్తిగత రుణాలు ప్రియం? ఈ ఏడాది వడ్డీరేట్లు 1.5 శాతం వరకు పెరిగే అవకాశం..!
Personal Loans | వ్యక్తిగత రుణాలు ఖరీదెక్కనున్నాయా? అంటే రుణదాతల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయిప్పుడు. ఆర్బీఐ తెచ్చిన కొత్త నిబంధనలతో ఈ ఏడాది వడ్డీరేట్లు 1.5 శాతం వరకు పెరిగే వీలుందని చెప్తున్నారు. అన్సెక్యూర్డ్ లోన్ల విభాగంలో ఉన్న వ్యక్తిగత రుణాల వంటివి గడిచిన కొన్నేండ్లుగా విపరీతంగా పెరుగుతుండటాన్ని ఆర్బీఐ గమనించింది.
Personal Loans | వ్యక్తిగత రుణాలు ఖరీదెక్కనున్నాయా? అంటే రుణదాతల నుంచి అవుననే సమాధానాలే వస్తున్నాయిప్పుడు. ఆర్బీఐ తెచ్చిన కొత్త నిబంధనలతో ఈ ఏడాది వడ్డీరేట్లు 1.5 శాతం వరకు పెరిగే వీలుందని చెప్తున్నారు. అన్సెక్యూర్డ్ లోన్ల విభాగంలో ఉన్న వ్యక్తిగత రుణాల వంటివి గడిచిన కొన్నేండ్లుగా విపరీతంగా పెరుగుతుండటాన్ని ఆర్బీఐ గమనించింది. ఈ క్రమంలోనే రిస్క్ వెయిటేజీని 100 నుంచి 125 శాతానికి పెంచింది. వచ్చే నెల 29కల్లా కొత్త నిబంధనల్ని ఆర్బీఐ పర్యవేక్షణలో ఉన్న అన్ని బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)లు తప్పక పాటించాల్సిందే. ఇప్పటికే ఆయా బ్యాంకులు ఈ దిశగా అడుగులు వేయగా, మరికొన్ని సిద్ధమవుతున్నాయి.
ఏం జరుగుతుంది?
ఆర్బీఐ కొత్త రూల్స్‌తో వ్యక్తిగత రుణాలను తీసుకున్నవారు మరింతగా చెల్లించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఈ పర్సనల్ లోన్ల కోసం తమ మూలధన నిల్వల్ని పెంచుకోవాల్సి వస్తున్నది మరి. నిపుణుల వివరాల ప్రకారం ప్రస్తుతం బ్యాంకులిచ్చే ప్రతీ రూ.100 పర్సనల్ లోన్‌కు తమ డిపాజిటర్ల ప్రయోజనాల రక్షణార్థం మరో రూ.100ను బ్యాంకులు రిస్క్-వెయిటెడ్ అసెట్స్‌గా పెట్టాల్సి వస్తున్నది. అయితే ఆర్బీఐ సవరించిన రూల్స్‌తో ఇక రూ.125ను కేటాయించాలి. ఇక క్యాపిటల్ అడికసీ రేషియో (సీఏఆర్) కింద ఈ రూ.125లో 9 శాతం (రూ.11.25) పక్కన పెట్టాలి. ఇంతకుముందు ఇది రూ.9గానే ఉండేది. అంటే ప్రతీ రూ.100 పర్సనల్ లోన్‌కు అదనంగా రూ.2.25 క్యాపిటల్‌ను బ్యాంకులు సమకూర్చుకోవాల్సి వస్తున్నది. ఈ భారం అంతిమంగా రుణగ్రహీతలపైనే పడుతుందని, వడ్డీరేట్ల పెంపు ద్వారానే అది ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది పర్సనల్ లోన్లపై వడ్డీరేట్లు గరిష్ఠంగా 1.5 శాతం వరకు పెరగవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే క్రెడిట్ కార్డుదారులకూ ఈ కొత్త రూల్స్ సెగ తగలనున్నది. బ్యాంకులు రిస్క్ వెయిటేజీని 150 శాతానికి పెంచాలి. ఇప్పుడు 125 శాతమే. ఎన్బీఎఫ్సీలు కూడా ఇప్పుడున్నదానికి 25 శాతం పెంచాలి. దీంతో క్రెడిట్ కార్డు వినియోగదారులూ అధికంగా చెల్లించాల్సి వస్తున్నది. ఈ రూల్స్‌తో మార్కెట్ల నుంచి రుణదాతలు ఎక్కువ నిధులను సమీకరించాల్సి వస్తున్నదని, దాంతో సదరు మొత్తాలకు చెల్లించే సొమ్మును రుణగ్రహీతల నుంచే సహజంగా వడ్డీరేట్ల పెంపుతో వసూలు చేస్తారని బ్యాంకింగ్ నిపుణులు చెప్తున్నారు. కనుక అధిక వడ్డీరేట్ల భారం తప్పదనే అంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

