ఎఫ్‌పీవోకు పతంజలి ఫుడ్స్ సిద్ధం
పబ్లిక్ వాటాను సెబీ నిర్దేశిత 25 శాతానికి పెంచేదిశగా బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి గ్రూప్ సంస్థ పతంజలి ఫుడ్స్ రెండవ ఫాలో ఆన్ పబ్లిక్ఆఫర్ (ఎఫ్‌పీవో) జారీచేయడానికి సిద్ధమవుతున్నది. వంటనూనెల విభాగంలో పేరొందిన పతంజలి ఫుడ్స్‌లో పబ్లిక్కు ప్రస్తుతం 19.18 శాతం వాటాయే ఉంది. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతాన్ని మించకూడదు
ముంబై, మార్చి 16: పబ్లిక్ వాటాను సెబీ నిర్దేశిత 25 శాతానికి పెంచేదిశగా బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి గ్రూప్ సంస్థ పతంజలి ఫుడ్స్ రెండవ ఫాలో ఆన్ పబ్లిక్ఆఫర్ (ఎఫ్‌పీవో) జారీచేయడానికి సిద్ధమవుతున్నది. వంటనూనెల విభాగంలో పేరొందిన పతంజలి ఫుడ్స్‌లో పబ్లిక్కు ప్రస్తుతం 19.18 శాతం వాటాయే ఉంది. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీలో ప్రమోటర్ల వాటా 75 శాతాన్ని మించకూడదు. ఇంతకు మించిన వాటాను కలిగి ఉన్నందున పతంజలి ఫుడ్స్ ప్రమోటర్ల షేర్లను స్టాక్ ఎక్సేంజీలు ఫ్రీజ్ చేశాయి.
ఈ నేపథ్యంలో గురువారం బాబా రాందేవ్ మాట్లాడుతూ షేర్ల ఫ్రీజ్వల్ల పతంజలి ఫుడ్స్ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరుపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. 2022 మార్చిలో కంపెనీ జారీచేసిన ఎఫ్‌పీవో కారణంగా కనీస పబ్లిక్ వాటా (ఎంపీఎస్) 19.18 శాతానికి పెరగ్గా, ఎంపీఎస్కు 5.82 శాతం తరుగు ఏర్పడుతున్నది. తాము 6 శాతం షేర్లను ఎఫ్‌పీవోలో విక్రయించి, పబ్లిక్ వాటాను 25 శాతానికి చేరుస్తామని రాందేవ్ అన్నారు. లిస్టింగ్ తర్వాత ఒక ఏడాది వరకూ సెబీ మార్గదర్శకాల ప్రకారం ప్రమోటర్ల షేర్లు లాక్ఇన్లో ఉన్నాయని, ఈ గడువు 2023 ఏప్రిల్ 8తో ముగియనున్నందున, మరో ఎఫ్‌పీవో జారీ ప్రక్రియను ఏప్రిల్ నెలలోనే ప్రారంభిస్తామని వివరించారు. పతంజలి ఫుడ్స్ ప్రమోటర్లుగా పతంజలి ఆయుర్వేద సీఈవో ఆచార్య బాలకృష్ణతో పాటు పలు గ్రూప్ సంస్థలు ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

