ITR Filing | ఐటీ రిటర్న్స్‌లో రికార్డ్.. ఆదివారమే 8.77 లక్షల ఫైలింగ్!
ITR Filing | ఈ నెల 26 వరకు 4.51 కోట్లకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. ఆదివారంనాడే 8,77,721 మంది ఐటీఆర్‌లు సమర్పించారు.

ITR Filing | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఇప్పటివరకు 4.51 కోట్ల పై చిలుకు ఐటీ రిటర్న్స్ దాఖలయ్యాయి. కేవలం ఆదివారం ఒక్కనాడే 8,77,721 ఐటీఆర్‌లు ఫైల్ అయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెలాఖరు వరకు ఐటీ రిటర్న్స్ గడువు ఉందని పేర్కొంది. ఈ నెల 26 వరకు సమర్పించిన 4.51 కోట్ల ఐటీఆర్‌ల్లో ఐటీఆర్-1లు 2.44 కోట్లు, ఐటీఆర్-4 ఫామ్‌లు 1.12 కోట్లు ఉన్నాయని వివరించింది.
చిన్న, మధ్యస్థాయి పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్- 1 (సహజ్), ఐటీఆర్- 4 (సుగమ్) ఫామ్స్ సమర్పించాల్సి ఉంటుంది. వేతనంతోపాటు ఒక ఇల్లు, ఇతర ఆదాయ మార్గాలు ఉన్న వారు సహజ్ పత్రాన్ని సమర్పించాలి. రూ.50 లక్షలపై చిలుకు ఆదాయం గల వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు ఐటీఆర్-4 ఫామ్స్ సమర్పించాల్సి వుంటుంది. గతేడాది మొత్తం 5.95 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- ITReturns
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

