Oppo Reno 12F 5G | ఒప్పో ప్రీమియం ఫోన్ ఒప్పో రెనో 12ఎఫ్ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Oppo Reno 12F 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో రెనో 12ఎఫ్ 5జీ (Oppo Reno 12F 5G) ఫోన్ ను మార్కెట్లో ఆవిష్కరించింది.
Oppo Reno 12F 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో రెనో 12ఎఫ్ 5జీ (Oppo Reno 12F 5G) ఫోన్ ను మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఆన్ బోర్డ్ స్టోరేజీతో వస్తోంది. ఏఐ రికార్డింగ్ సమ్మరీ, ఏఐ సమ్మరీ ఫర్ టెక్ట్స్, ఏఐ రైటర్, ఏఐ స్పీక్ వంటి ఏఐ ఫీచర్లతో రూపుదిద్దుకున్నది. 45వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీతో 100 శాతం చార్జింగ్ కావడానికి 71 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాల చార్జింగ్ తో 6.2 గంటల టాక్ టైం, 5.05 గంటల వీడియో ప్లే బ్యాక్ టైం బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. అంబర్ ఆరేంజ్, ఒలీవ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అయితే ధర వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఒప్పో రెనో 12 5జీ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.44,700 (499.99 యూరోలు), ఒప్పో రెనో 12 ప్రో ఫోన్ ధర దాదాపు రూ.53,700 (599.99 యూరోలు) ఉంటుంది.
ఒప్పో రెనో 12ఎఫ్ 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14.0 వర్షన్ పై పని చేస్తుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు మద్దతుతో 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) ఓలెడ్ డిస్ ప్లేతో వస్తోంది. 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు ఏజీసీ డీటీ స్టార్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో పని చేస్తుంది.
ఒప్పో రెనో 12 ఎఫ్ 5జీ ఫోన్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తోంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
ఒప్పో రెనో 12ఎఫ్ 5జీ ఫోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11 ఏ/బీ/జీ/ఎన్, బ్లూటూత్ 5.3, బైదూ, గ్లోనాస్, గెలీలియో, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ టైప్ -సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. యాక్సెలరో మీటర్, కలర్ టెంపరేచర్ సెన్సర్, గ్రావిటీ సెన్సర్, జియో మ్యాగ్నెటిక్ సెన్సర్, ఐఆర్ కంట్రోల్, ప్రాగ్జిమిటి సెన్సర్, ఆప్టికల్ సెన్సర్, సెక్యూరిటీ అండ్ బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ రికగ్నిషన్‌కు మద్దతుగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
Tata Motors | ఆరేండ్లలో 60 లక్షల కార్ల విక్రయాలు.. ఇదీ టాటా మోటార్స్ బ్లూ ప్రింట్ ..!
Maruti Suzuki Swift | మారుతి ‘సిగ’లో మరో మైలురాయి.. 30 లక్షలు దాటిన ‘స్విఫ్ట్’ సేల్స్..!
Bharti Airtel | ఎయిర్ టెల్ టారిఫ్ ప్లాన్ల మోత.. 20 శాతం వరకూ పెంపు..
July Bank Holidays | జూలైలో బ్యాంకులకు 12 రోజులు సెలవులు. .ఇవీ డిటైల్స్..!
Realme C61 5G | రియల్మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్మీ సీ 61 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

