Oppo A3 Pro | గ్లోబల్ మార్కెట్లోకి ఒప్పో ఏ3 ప్రో.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
Oppo A3 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఒప్పో ఏ3 ప్రో ఫోన్ ను చైనాతోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది.
Oppo A3 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఒప్పో ఏ3 ప్రో ఫోన్ ను చైనాతోపాటు గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్, 12 జీబీ ర్యామ్ తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14 ఔటాఫ్ బాక్స్ వర్షన్ మీద పని చేస్తుంది. 6.7 అంగుళాల అమోలెడ్ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. భారత్ మార్కెట్లో ఎప్పుడు ఆవిష్కరిస్తారన్న సంగతి వెల్లడించలేదు.
అజూర్, క్లౌడ్ బ్రోకెడ్ పౌడర్, మౌంటేన్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఒప్పో ఏ3 ప్రో ఫోన్ లభిస్తుంది. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.23,490 (1999 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.25,820 (2199 చైనా యువాన్లు), 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.29,345 (2499 చైనా యువాన్లు) పలుకుతుంది.
ఒప్పో ఏ3 ప్రో 5జీ ఫోన్ 6ఎన్ఎం ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ ప్రాసెసర్ కలిగి ఉంటుంది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2412 పిక్సెల్స్) అమోలెడ్ కర్వ్డ్ డిస్ ప్లే కలిగి ఉంటది. కంఫర్టబుల్ వ్యూయింగ్ ఎక్స్ పీరియన్స్ కోసం 2160 హెర్ట్జ్ హై ఫ్రీక్వెన్సీతో వస్తున్నది.
ఒప్పో ఏ3 ప్రో 5జీ ఫోన్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో అందుబాటులో ఉంటది. 64-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 67వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. 20 నిమిషాల్లో 56 శాతం, 42 నిమిషాల్లో 100 శాతం బ్యాటరీ చార్జింగ్ అవుతుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

