Oppo A18 | మార్కెట్లోకి ఒప్పో కొత్త బడ్జెట్ ఫోన్ ఒప్పో ఏ18.. ధరెంతంటే..?!
Oppo A18 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. భారత్ మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ ఒప్పో ఏ18 ను శుక్రవారం ఆవిష్కరించింది. దీని ధర కేవలం రూ.9,999 మాత్రమే.
Oppo A18 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) బడ్జెట్ సెగ్మెంట్లో మరో ఫోన్ ఒప్పో ఏ18 (Oppo A18) ఫోన్ శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఒక్టాకోర్ మీడియాటెక్ హేలియో చిప్ సెట్, హెచ్డీ + ఎల్సీడీ డిస్ ప్లే కలిగి ఉంటుందీ ఫోన్. డ్యుయల్ రేర్ కెమెరా యూనిట్, రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సింగిల్ స్టోరేజీ ఆప్షన్ తో వస్తున్నదీ ఒప్పో ఏ18 ఫోన్.
ఒప్పో ఏ18 ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.9,999 పలుకుతుంది. గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఒప్పో ఆన్ లైన్ స్టోర్, దేశీయంగా అన్ని రిటైల్ స్టోర్లలోనూ లభిస్తుంది. ఒప్పో ఏ18 ఫోన్ 6.56 అంగుళాల (1612×720 పిక్సెల్స్) ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 720 నిట్స్ పీక్ బ్రైట్ నెస్, ఒక్టాకోర్ మీడియాటెక్ హెలియో జీ85 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ -13 బేస్డ్ కలర్ ఓఎస్ 13.1 వర్షన్‌పై పని చేస్తుంది.
8-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరాతోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 5-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. ఒప్పో ఏ18 ఫోన్ 5000 ఎంఏహెచ్ కెపాసిటీతో కూడిన బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగి ఉంటుంది. 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 3.5 ఆడియో జాక్ కనెక్టివిటీ కూడా ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

