Small Cap Funds | 27 స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో బెంచ్ మార్క్ రిటర్న్స్ అందించిన ఫండ్స్ ఇవే..!
Small Cap Funds | ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ.. 27 స్మాల్ క్యాప్ ఫండ్స్ లో 12 పండ్స్ లో పెట్టుబడులపై గణనీయ రిటర్న్స్ లభించాయి.
Small Cap Funds | వేతన జీవులైనా, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లైనా, చిన్న వ్యాపారులైనా.. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత మొత్తం కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేస్తుంటారు. ప్రభుత్వోద్యోగులు, చిన్న వేతనాలపై పని చేసే వారు ఫిక్స్ డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే వాటిల్లో వచ్చే రిటర్న్స్ పరిమితంగా ఉంటాయి. మరి కొందరు రియాల్టీ, స్టాక్ మార్కెట్లు, స్టాక్ మార్కెట్ల ఆధారిత ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తుంటారు. స్టాక్స్, స్టాక్స్ ఆధారిత ఫండ్స్ లో పెట్టుబడులకు రిస్క్ ఎక్కువగా ఉన్నా లాభాలు అదే స్థాయిలో ఉంటాయి. మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఆ కోవలోకే వస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ.. 27 స్మాల్ క్యాప్ ఫండ్స్ లో 12 పండ్స్ లో పెట్టుబడులపై గణనీయ రిటర్న్స్ లభించాయి. ఏసీఈ ఎంఎఫ్ డేటా ప్రకారం మొత్తం 27 స్మాల్ క్యాప్ ఫండ్స్ లో 12 ఫండ్స్ 44 శాతం పెర్ఫార్మెన్స్ ప్రదర్శించాయి.
స్మాల్ క్యాప్ ఫండ్స్ లో నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్.. గత ఆరు నెలల్లో (నిఫ్టీ స్మా్ల్ క్యాప్ 250) సరాసరి బెంచ్ మార్క్ రిటర్న్స్ తో పోలిస్తే 21.89 శాతం రిటర్న్స్ అందించింది.
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ లో పెట్టుబడులు పెట్టిన వారికి గత ఆరు నెలల్లో 25.19 శాతం రిటర్న్స్ లభించాయి.
ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్స్ లో మదుపర్ల పెట్టుబడులపై గత ఆరు నెలల్లో 22.52 శాతం రిటర్న్స్ వచ్చాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో సగటు రిటర్న్స్ 20.65 శాతంగా ఉండటం గమనార్హం.
టాటా స్మాల్ క్యాప్ ఫండ్ లో పెట్టుబడులు 21.62 (నిఫ్టీ స్మాల్ క్యాప్ 250లో సగటున 21.24 శాతం రిటర్న్స్) శాతం రిటర్న్ తెచ్చి పెట్టాయి.
ఇంకా బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్, హెచ్ఎస్బీసీ స్మాల్ క్యాప్ ఫండ్, ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్, ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్, ఎల్ఐసీ ఎంఎఫ్ స్మాల్ క్యాప్ ఫండ్, మహీంద్రా మనులైఫ్ స్మాల్ క్యాప్ ఫండ్.. తమ ఇన్వెస్టర్లకు గణనీయ రిటర్న్స్ అందించాయి.
ఇవి కూడా చదవండి :
Oppo Reno 12F 5G | ఒప్పో ప్రీమియం ఫోన్ ఒప్పో రెనో 12ఎఫ్ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
World Bank | గ్రీన్ ఎనర్జీ కోసం భారత్‌కు ప్రపంచ బ్యాంకు 150 కోట్ల డాలర్ల రుణం..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

