న్యూఢిల్లీ : స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ ఎలక్ట్రిక్ సైకిళ్లు, స్కూటర్ల తయారీతో ఆటోమొబైల్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. వన్‌ప్లస్ లైఫ్ పేరుతో ట్రేడ్‌మార్క్‌ను లిస్టింగ్ చేయడంతో ఈ స్కూటర్లు, రిమోట్ కంట్రోల్ వాహనాలు, డ్రైవర్‌రహిత కార్ల వంటి ఉత్పత్తులను కంపెనీ లాంఛ్ చేయవచ్చని భావిస్తున్నారు.
ఈ బ్రాండ్‌పై వన్‌ప్లస్ మరికొన్నేండ్లలో తొలి ఉత్పత్తిని మార్కెట్లోకి తీసుకురావచ్చని చెబుతున్నారు. నాన్ మొబైల్ గాడ్జెట్స్‌ను కంపెనీ వన్‌ప్లస్ లైఫ్ బ్రాండింగ్ కింద లాంఛ్ చేస్తుందని ట్రేడ్‌మార్క్ లిస్టింగ్‌తో సంకేతాలు వెల్లడయ్యాయి. ఆటోమోటివ్ విభాగం కోసమే వన్‌ప్లస్ లైఫ్ పేరుతో ఆల్ న్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసిందని భావిస్తున్నారు.