OnePlus 11 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ (OnePlus) తన వన్ ప్లస్ 11 5జీ (OnePlus 11 5G) ఫోన్ ధర తగ్గించింది. గతేడాది ఫిబ్రవరిలో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన వన్ ప్లస్ 11 5జీ (OnePlus 11 5G) ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్, సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వచ్చింది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ తో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 10-బిట్ ఎల్టీపీఓ 3.0 అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటది. హైపర్ బూస్ట్ గేమింగ్ ఇంజిన్, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ యూఐ ఓఎస్ వర్షన్ కలిగి ఉంటుంది. గత జనవరిలోనే వన్ ప్లస్ 11 5జీ ఫోన్ కొనసాగింపుగా వన్ ప్లస్ 12 5జీ ఫోన్ ఆవిష్కరించింది.
వన్ ప్లస్ 11 5జీ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ లాంచింగ్ ధర రూ.56,999 కాగా, ఇప్పుడు రూ.51,999లకే లభిస్తుంది. ఇంతకుముందే రూ.2000 తగ్గించిన వన్ ప్లస్, తాజాగా మరో రూ.3,000 ధర తగ్గించింది. ఎటర్నల్ గ్రీన్, టైటాన్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటది. కస్టమర్లకు ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.5,000 డిస్కౌంట్ లభించడంతోపాటు ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు లేదా వన్ కార్డుపై కొనుగోలు చేసే వారికి రూ.3,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. 12 నెలల నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
వన్ ప్లస్ 11 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, కార్నింగ్ గొరిల్లా విక్టస్ ప్రొటెక్షన్ తోపాటు 6.7 అంగుళాల క్వాడ్ హెచ్డీ+ (1440×3216 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. అడెర్నో 740 జీపీయూతోపాటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీ, ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13 ఔటాఫ్ బాక్స్ వర్షన్ పై పని చేస్తుందీ ఫోన్.
50-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 48-మెగా పిక్సెల్ 0.5 అంగుళాల సోనీ ఐఎంఎక్స్ 581 సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 1/2.74 అంగుళాల సోనీ ఐఎంఎక్స్ 709 సెన్సర్ విత్ టెలిఫోటో, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సోనీ ఐఎంఎక్స్ 471 సెన్సర్ కెమెరా ఉంటుంది.
వన్ ప్లస్ 11 5జీ ఫోన్ 100 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, అలర్ట్ స్లైడర్ ఉంటుంది. 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యూఎస్బీ 2.0 టైప్ సీ కనెక్టివిటీ ఉంటుంది.