Google retrenchment | గూగుల్‌పై ఇన్వెస్టర్ల ఒత్తిళ్లు.. 10 వేల మంది ఉద్యోగుల తొలగింపునకు ప్రణాళిక
Google retrenchment | లేఆఫ్స్ ప్రకటించిన పలు సంస్థల దారిలో గూగుల్ నడవనున్నది. హెడ్జ్ ఫండ్ బిలియనీర్ సూచనల మేరకు ఉద్యోగులను తొలగించేందుకు ఆల్ఫాబెట్ నడుం బిగించింది. 10 వేల మంది తొలగింపునకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం.
Google retrenchment | త్వరలో గూగుల్ సంస్థలో కూడా ఉద్యోగులను తొలగించే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చు తగ్గించుకోవాలంటూ ఇన్వెస్టర్లు ముఖ్యంగా హెడ్జ్ ఫండ్ నుంచి గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్‌కు తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో ఉద్యోగుల సంఖ్యను పరిమితం చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది. దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళిక సిద్ధమైనట్లుగా ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఇప్పటికే మెటా, అమెజాన్, ట్విట్టర్, సిస్కో సహా జొమాటో వంటి పలు అంతర్జాతీయ సంస్థలు లేఆఫ్స్‌ను ప్రకటించాయి. వీటి దారిలోనే గూగుల్ కూడా రిట్రెంచ్‌మెంట్ పాలసీని అమలు చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పుడున్న ఉద్యోగుల సంఖ్యలో దాదాపు 6 శాతం మంది సిబ్బందిని తగ్గించాలనేది కంపెనీ ప్రణాళిక. తొలుత అత్యల్ప ర్యాంక్ ఉన్న ఉద్యోగులపై వేటు పడనున్నట్లు సమాచారం. ఇప్పటికే అండర్ పెర్ఫర్మింగ్ ఉద్యోగులను గుర్తించాలని మేనేజర్ స్థాయి అధికారులను గూగుల్ మాతృసంస్థ ఆల్ఫబెట్ ఆదేశించడం.. ఉద్యోగుల రిట్రెంచ్‌మెంట్ పాలసీ కోసమే అని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
ఇలాఉండగా, బ్రిటన్ హెడ్జ్ ఫండ్ బిలియనీర్ క్రిస్టోఫర్ హాన్.. ఆల్ఫాబెట్‌కు లేఖ రాశారు. ఆల్ఫాబెట్ ఉద్యోగులకు ఇతర టెక్ దిగ్గజాల కంటే చాలా ఎక్కువ వేతనం లభిస్తుందని, ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉన్నదని తన లేఖలో పేర్కొన్నారు. ఆల్ఫాబెట్లో దాదాపు 1,87,000 మంది ఉద్యోగులు ఉన్నారు. క్రిస్టోఫర్ హాన్ ప్రకారం, కంపెనీలో ప్రస్తుత అవసరాలకు ఉద్యోగుల సంఖ్య సరిపోలడం లేదు. చాలా తక్కువ చెల్లింపు నిపుణులతో సెర్చ్ ఇంజన్ని సమర్ధవంతంగా నడపవచ్చునని హాన్ పేర్కొన్నారు.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ ఫైలింగ్ ప్రకారం, గత ఏడాది ఆల్ఫాబెట్ ఉద్యోగుల సగటు జీతం దాదాపు 2,95,884 డాలర్లు. ఈ జీతం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు చెల్లిస్తున్న దాని కంటే దాదాపు 70 శాతం ఎక్కువ అని హాన్ తన లేఖలో తెలిపారు. అమెరికాలోని 20 అతిపెద్ద టెక్ కంపెనీలతో పోలిస్తే ఆల్ఫాబెట్ దాని ఉద్యోగులకు పోటీ కంపెనీల కంటే 153 శాతం ఎక్కువ జీతాలు చెల్లిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

