OLX Layoff | ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలు సగం మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. తాజాగా ఆ జాబితాలోకి ఆన్లైన్ ట్రేడింగ్ కంపెనీ ఓఎల్ఎక్స్ వచ్చి చేరింది. ప్రస్తుతం ఆన్ లైన్ సెకండ్ హ్యాండ్ వస్తువుల విక్రయంలో అగ్రస్థానంలో ఉన్న ఓఎల్ఎక్స్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో 10వేల మంది పనిచేస్తున్నారు. అందులో 15 శాతం అంటే 1,500 మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. తొలగింపు లిస్ట్‌లో భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఉన్నారు. అయితే, వీరిలో ఎంతమందిని తొలగిస్తున్నారనేది ఇంకా తెలియరాలేదు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓఎల్ఎక్స్ అధికారి ఒకరు తెలిపారు.