Ola S1 Air | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎస్1 ఎయిర్.. ధరెంతంటే?!
Ola S1 Air | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్.. మార్కెట్లోకి కొత్తగా ఎస్1 ఎయిర్ వేరియంట్ తీసుకొచ్చింది. ఇది అన్ని క్యాటగిరీ స్కూటర్లలో లభ్యం అవుతుంది.
Ola S1 Air | ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ తయారీ సంస్థ ఓలా న్యూ రేంజ్ ఈ-స్కూటర్ ఓలా ఎస్1 ఎయిర్ మోడల్ తీసుకొచ్చింది. ఇప్పటికే 2కేడబ్ల్యూహెచ్, 3కేడబ్ల్యూహెచ్, 4కేడబ్ల్యూహెచ్ వేరియంట్లలో ఎస్1 ఎయిర్ స్కూటర్ వస్తుంది. న్యూ ఎస్1 ఎయిర్ స్కూటర్ ధర రూ.84,999-1,09,999 మధ్య ఉంటుంది. సింగిల్ చార్జింగ్‌తో 85-165 కి.మీ. దూరం వరకు ప్రయాణించడం దీని సత్తా. మూడు న్యూ వేరియంట్లలో లభ్యమయ్యే ఎస్1 ఎయిర్ స్కూటర్ ఎక్కువ మంది కస్టమర్లు ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్లేందుకు పలు ధరల్లో అందుబాటులోకి తెచ్చామన్నారు భవిష్ అగర్వాల్.
ఎస్1 స్కూటర్లలో సరికొత్తగా 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్ తీసుకొచ్చింది. ప్రతి రోజూ 20-30 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించే వారి వెసులుబాటు కోసం 2కేడబ్ల్యూహెచ్ కెపాసిటీ బ్యాటరీ ఆప్షన్ తీసుకొచ్చినట్లు ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ భవిష్ అగర్వాల్ తెలిపారు. దీని ధర రూ.99,999 అని తెలిపారు. సింగిల్ చార్జ్‌తో 91 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు.

ఇప్పుడు మార్కెట్లో ఎస్1, ఎస్1 ప్రో వేరియంట్లు ఉన్నాయి. వీటికి అదనంగా ఎస్1 ఎయిర్‌లో మూడు వేరియంట్లు, ఎస్1లో ఒక వేరియంట్ స్కూటర్ తెచ్చింది. దీంతో ఎస్1, ఎస్1 ప్రోతో కలిపితే మొత్తం ఆరు స్కూటర్లు కొనుగోలుదారులకు అందుబాటులోకి వస్తాయి. ఇక 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల స్కూటర్ ఎస్1 ఎయిర్ వేరియంట్ ధర రూ.84,999, అదే బ్యాటరీ సామర్థ్యం గల ఎస్1 స్కూటర్ ధర రూ.99,999గా ఓలా ఎలక్ట్రిక్ నిర్ణయించింది.
ఎస్1 స్కూటర్ వేరియంట్లో కొత్తగా తెచ్చిన 2కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల ఓలా ఎస్1 స్కూటర్ ఒక్కసారి చార్జి చేస్తే 91 కి.మీ. దూరం ప్రయాణం చేయొచ్చు. గంటకు 90 కి.మీ. గరిష్ట వేగంతో ప్రయాణించొచ్చు.
ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న 3కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ కెపాసిటీ గల ఎస్1 స్కూటర్‌తో ఒక్కసారి చార్జి చేస్తే 141 కి.మీ. దూరం వెళ్లవచ్చు. గరిష్టంగా గంటకు 95 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుందీ స్కూటర్.
ఓలా ఎస్1 ప్రో వేరియంట్ స్కూటర్.. 4కేడబ్ల్యూహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో పని చేస్తుంది. 8.5 కిలోవాట్ల కెపాసిటీ మోటార్‌తో నడుస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 181 కి.మీ దూరం ప్రయాణించే ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 116 కి.మీ స్పీడ్‌తో వెళుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

