October Bank Holidays | కాలగర్భంలో మరో నెల కలిసిపోవడానికి కొన్నిరోజులే మిగిలి ఉన్నాయి. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ నెల ప్రారంభం కాబోతున్నది. ఇటీవల ప్రతి నెలా ప్రజల జీవితాల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇక ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. 2016లో పాత పెద్ద నోట్ల రద్దు.. రెండేండ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రభావంతో అందరూ ఆన్లైన్లోనే నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నా.. అవి స్మార్ట్ ఫోన్ల వినియోగదారులకే అందుబాటులో ఉన్నాయి.
సాధారణ ఫోన్ల వాడకం దారులు ఇప్పటికీ బ్యాంకు శాఖలను సందర్శించి తమ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అయితే, అక్టోబర్లో మహార్నవమి, విజయదశమి, గాంధీ జయంతి తదితర పండుగలు, జాతీయ దినోత్సవాల వల్ల కేవలం తొమ్మిది రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. ఈ తరుణంలో ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో తెలుసుకుంటే ఆయా బ్రాంచ్లకు వెళ్లి లావాదేవీలు నిర్వహించుకోవడం ఈజీగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో వేడుకలు, పర్వదినాలను బట్టి సెలవుల్లో మార్పులు ఉండొచ్చు.
వచ్చేనెల 22-24 తేదీల మధ్య మూడు రోజులు బ్యాంకులు మూసి ఉంటాయి. 22 నాలుగో శనివారం, 23 ఆదివారం, 24 దీపావళి పండుగ సందర్భంగా బ్యాంకులు పని చేయవు. అయితే గ్యాంగ్టక్, హైదరాబాద్, ఇంఫాల్ వంటి నగరాలు, పట్టణాల్లో మినహాయింపులు ఉంటాయి.
గ్యాంగ్టక్లో వచ్చేనెల నాలుగో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు బ్యాంకులు పని చేయవు. 4న దుర్గా పూజ/మహర్నవమి, 5న విజయ దశమి (దసరా) పండుగ సెలవులు. ఇక జాతీయ సెలవు దినాలైన 8న రెండో శనివారం, 9న ఆదివారం బ్యాంకులు పని చేయవు.
తేదీ – సెలవు కారణం
1 —- అర్థసంవత్సర ఖాతాల ముగింపు
2 —- గాంధీ జయంతి
3 —- మహా అష్టమి (దుర్గా పూజ)
4 —- మహార్నవమి (దుర్గా పూజ)
5 —- విజయదశమి (శ్రీమంత శంకరదేవ జమ్మోత్సవ్)
6 —- దుర్గా పూజ (దసైన్)
7 —- దుర్గా పూజ (దసైన్)
8 —- మిలాద్ ఈ షరీఫ్/ ఈద్ ఈ మిలాద్ ఉల్ నబీ (మహ్మద్ ప్రవక్త జయంతి)
13 — కార్వచౌత్
14 — (శుక్రవారం) ఈద్ ఈ మిలాద్ ఉల్ నబీ సందర్భంగా సెలవు)
18 — కాటి బిహు
24 — కాళీ పూజ/ లక్ష్మీ పూజ (నరక చతుర్థి)
25 — లక్ష్మీ పూజ / దీపావళి/ గోవర్ధన్ పూజ
26 — గోవర్ధన్ పూజ/ విక్రమ్ సాంవంత్ నూతన సంవత్సరాది
27 — భాయిదూజ్/ చిత్రగుప్త్ జయంతి/ లక్ష్మీ పూజ / దీపావళి/ నింగోల్ చక్కౌబ
31 — సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి/ సూర్య పస్తి దాల ఛాత్