NTPC Big Target| ఎన్టీపీసీ బిగ్ టార్గెట్.. కచ్‌లో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్.. ఎంతంటే?!
NTPC Big Target| కచ్‌లో అతిపెద్ద సౌర విద్యుత్ ప్లాంట్.. ఎంతంటే?!| ఎన్టీపీసీ గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ నిర్మించాలని ....

న్యూఢిల్లీ: దేశంలోని అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థ ‘ఎన్టీపీసీ’ ( NTPC ) వచ్చే పదేండ్లలో అతిపెద్ద సోలార్ పార్క్ నిర్మాణానికి లక్ష్యం నిర్దేశించుకున్నది. గుజరాత్‌లోని కచ్‌లో 4,750 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సోలార్ పార్క్ నిర్మించనున్నది.
ఈ ప్రాజెక్టును ఎన్టీపీసీ అనుబంధన ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (ఎన్టీపీసీ ఆర్ఈఎల్) చేపట్టనున్నది. అందుకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ (ఎంఎన్ఆర్ఈ) అనుమతి ఇచ్చింది.
ఇటీవల కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ కూడా రాబోయే రోజుల్లో సంప్రదాయేతర ఇంధన రంగంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటన చేసింది. ఈ రెండు కంపెనీలతోపాటు ఆదానీ గ్రూప్ కూడా గుజరాత్లో శరవేగంగా తన సోలార్ ప్లాంట్‌ను విస్తరించనున్నది.
రిలయన్స్ మాదిరిగానే ఎన్టీపీసీ సైతం సోలార్ ప్లాంట్‌లో గ్రీన్ హైడ్రోజన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గత ఐదేండ్లుగా ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా చిన్న సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నది.

ప్రస్తుతం సౌర విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి ఎన్టీపీసీ మొత్తం 6,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నది. 2032 నాటికి 60 వేల మెగావాట్ల విద్యుత్ తయారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. మెజారిటీ సౌర విద్యుత్ ప్లాంట్లు గుజరాత్‌లోనే ఉంటాయి.
ఎన్టీపీసీ ప్రస్తుతం చేపట్టిన 1,800 మెగావాట్ల ప్రాజెక్టు ప్రగతిలో ఉంది. సౌర విద్యుత్ తయారు చేయడానికి పెట్టుబడులు ఎలా సేకరిస్తుందన్న సంగతిని ప్రకటించలేదు.
సోలార్ ప్లాంట్ ద్వారా మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి రూ.4 కోట్లు ఖర్చవుతుంది. దీని ప్రకారం తన లక్ష్యాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలంటే ఎన్టీపీసీకి రూ.2.40 లక్షల కోట్ల నుంచి రూ.2.50 లక్షల కోట్లు పెట్టుబడులు కావాలి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Gujarat
- NTPC
- solar plant
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

