Post Office Recurring Deposit | పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌పై అధిక రిటర్న్స్.. ఎలాగంటే..?!
Post Office Recurring Deposit | గతంతో పోలిస్తే పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో పెట్టుబడులపై అధిక రిటర్న్స్ పొందొచ్చు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఈ పథకంలో పెట్టుబడులపై వడ్డీరేటు 6.5 నుంచి 6.7 శాతానికి పెంచుతూ కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయం తీసుకున్నది.
Post Office Recurring Deposit | ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో కొంత మొత్తం పిల్లల అవసరాలు, భవిష్యత్ లక్ష్యాల కోసం పొదుపు చేస్తూ ఉంటారు. అత్యధికులు రిస్క్ లేని పొదుపు పథకాల్లో మదుపు చేయడానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అటువంటి వాటిల్లో పోస్టాఫీసు పొదుపు పథకాలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాయి. అందులో రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) పథకం వడ్డీరేట్లు అక్టోబర్ ఒకటో తేదీ నుంచి పెరుగుతున్నాయి. రికరింగ్ డిపాజిట్ మీద వడ్డీరేటు 6.5 నుంచి 6.7 శాతానికి పెరుగుతున్నది. మీరు కొద్ది మొత్తంతో తేలిగ్గా భారీ నిధి క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి నెలా రూ.2000 పెట్టుబడి పెడితే ఐదేండ్ల తర్వాత సుమారు రూ.1.42 లక్షల రిటర్న్స్ వస్తాయి. ఈ పథకం గురించి తెలుసుకుందాం..
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకం మీ పొదుపును ప్రోత్సహించడానికి సహకరిస్తుంది. దీన్ని మీరు పిగ్గీ బ్యాంకుగా కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రతి నెలా నిర్దిష్ట మొత్తం డిపాజిట్ చేస్తే ఐదేండ్లకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అతిపెద్ద మొత్తం అవుతుంది.
పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంలో ముఖ్యాంశాలు..
ఇండియన్ పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పథకంపై 6.7 శాతం వడ్డీ లభిస్తుంది.
మీరు ప్రతినెల కనీసం రూ.100 మదుపు చేయొచ్చు.
ప్రతి నెలా వందకు పది రెట్లు పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్ట పరిమితి లేనేలేదు.
రికరింగ్ డిపాజిట్ ద్వారా రూ.40 వేలు (సీనియర్ సిటిజన్లు రూ.50 వేలు) వడ్డీ పొందినా ట్యాక్స్ వర్తించదు. అంతకంటే ఎక్కువ మొత్తం వడ్డీ ఆదాయం పొందితే మాత్రం టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. రికరింగ్ డిపాజిట్‌పై రూ.40 వేలకు పైగా వడ్డీ ఆదాయం పొందినా, వార్షికాదాయం పన్ను శ్లాబ్ పరిధి కంటే తక్కువగా ఉన్నా.. మీ ఖాతా నుంచి బ్యాంకు టీడీఎస్ డిడక్ట్ చేయదు. ఇందుకోసం సీనియర్ సిటిజన్లు ఫామ్-15హెచ్, ఇతరులు ఫామ్-15జీ ఫామ్ (సెల్ఫ్ డిక్లరేషన్) సబ్మిట్ చేయాలి. మీ ఆదాయం పన్ను పరిధి కంటే తక్కువ అని బ్యాంకుకు తెలియజేయడం అన్నమాట.
ఎవరైనా ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. చిన్న పిల్లల పేరు మీదైనా ప్రారంభించవచ్చు. పదేండ్లు దాటినట్లైతే మీరు ఆ ఖాతా నిర్వహించుకోవచ్చు. ముగ్గురు వ్యక్తులు కలిసి జాయింట్ ఖాతా నిర్వహించవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

