మనలో చాలామందికి వ్యక్తిగత రుణాలకున్న ప్రాధాన్యతల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి పూచీకత్తు లేని ఈ రుణాలపై వడ్డీరేటు కాస్త ఎక్కువే. అయినప్పటికీ మార్కెట్లో వీటికున్న ఆదరణ అంతాఇంతా కాదు. అలాంటి ఈ రుణాలకు అర్హత విషయానికొస్తే.. బ్యాంకర్లు ప్రధానంగా కొన్ని అంశాలను పరిశీలిస్తున్నారు.
వాటిలో రుణగ్రహీత సిబిల్ స్కోర్, రుణాన్ని తిరిగి చెల్లించే సామర్థ్యం కీలకంగా నిలుస్తున్నాయి. కాబట్టి మీ రుణ చరిత్రకు ఎటువంటి మచ్చ లేకుండా చూసుకోవడం మంచిది. లోన్ డిఫాల్టర్‌గా తేలితే మీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. కాగా, ఎస్బీఐలో సాలరీ అకౌంట్ ఉన్నవారికి పర్సనల్ లోన్ కావాలంటే నెలసరి ఆదాయం రూ.15,000 తప్పనిసరి. ఈఎంఐ/ఎన్ఎంఐ రేషియో 50 శాతంలోపే ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకు కాస్త సులువుగానే రుణాలు లభిస్తున్నాయి.