Airtel Payments Bank Watch : స్మార్ట్‌వాచ్ ద్వారా చెల్లింపులు చేపట్టేందుకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, నాయిస్, మాస్టర్‌కార్డ్ చేతులు కలిపాయి. ఇక పేమెంట్స్ కోసం ఎంతమాత్రం ఫోన్ కోసం వెతికే పరిస్ధితి లేదు. పేమెంట్స్ చేసేందుకు ఎంచక్కా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ స్మార్ట్‌వాచ్‌ను ఉపయోగించవచ్చు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కోసం నాయిస్ ఈ స్మార్ట్‌వాచ్‌ను క్రియేట్ చేసింది. తమ చేతికి ఉండే స్మార్ట్‌వాచ్‌ను ట్యాప్ చేస్తూ ఎలాంటి చెల్లింపులనైనా ఇట్టే చేపట్టవచ్చు.
ఈ స్మార్ట్‌వాచ్ రూ. 2999కి అందుబాటులో ఉంటుంది. ఎయిర్టెల్ ధ్యాంక్స్ యాప్ నుంచి ప్రస్తుత ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు ఈ స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయవచ్చు. నూతన కస్టమర్లు యాప్‌పై డిజిటల్ పద్ధతిలో బ్యాంక్ ఖాతాను తెరిచి నేరుగా స్మార్ట్‌వాచ్‌ను ఆర్డర్ చేయవచ్చు. యాప్ ద్వారా కేవలం నిమిషంలోనే వాచ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. పేమెంట్ మెషీన్స్‌పై వాచ్‌ను ట్యాప్ చేయడం ద్వారా పేమెంట్స్ చేయవచ్చు.
పేమెంట్ ఫీచర్‌తో పాటు ఈ వాచ్‌లో హెల్త్, ప్రొడక్టివిటీ ఫీచర్లున్నాయి. 1.85 ఇంచ్ స్క్వేర్ డయల్‌లో డిజైన్ చేసిన ఈ వాచ్ ద్వారా కాంటాక్ట్స్ లెస్ పేమెంట్స్‌ను మీ మణికట్టు నుంచే చక్కబెట్టవచ్చు. మాస్టర్‌కార్డ్ నెట్వర్క్ ఆధారిత స్మార్ట్‌వాచ్ ద్వారా పలు అవుట్‌లెట్స్, టెర్మినల్స్‌లో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ చేపట్టేందుకు వెసులుబాటు ఉంది. ఈ వాచ్‌తో లావాదేవీలను ప్రతిఒక్కరికీ సౌకర్యవంతంగా చేపట్టే వీలు కలుగుతుంది.
Read More :
IT Raids | చట్నీస్ హోటల్స్‌పై ఐటీ దాడులు.. యజమాని ఇండ్లలోనూ సోదాలు