Reciprocal Tariffs | అమెరికాపై ప్రతి చర్యలు వద్దు.. మోదీ సర్కార్ యోచన
భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన భారత ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు.
Reciprocal Tariffs | న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: భారతీయ ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 26 శాతం సుంకాలపై ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన భారత ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. ఉభయ దేశాల మధ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ట్రంప్ విధించిన సుంకాల నుంచి ఉపశమనం కలిగించే మార్గాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, అయితే ఇవి ప్రతీకార చర్యగా ఉండకూడదని భావిస్తున్నదని తన పేరును వెల్లడించడానికి నిరాకరించిన ఆ అధికారి తెలిపారు.
అటువంటి ఒప్పందాల కోసం భారత్ కృషి చేస్తున్నదని ఆయన చెప్పారు. ప్రతీకార సుంకాల విషయానికి వస్తే ఇతర ఆసియా దేశాలైన చైనా, వియత్నాం, ఇండోనేషియాతో పోలిస్తే భారత్ మెరుగైన స్థానంలో ఉందని, ఇది మనకు ప్రయోజనకర అంశమని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 2న భారత్తోసహా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు.
అమెరికాలో దిగుమతి అయ్యే ప్రతి వస్తువుపై కనిష్ఠంగా 10 శాతం నుంచి గరిష్ఠంగా 49 శాతం వరకు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. అమెరికా నుంచి భారత్ 52 శాతం సుంకాలు వసూలు చేస్తున్నదని, అందుకే ఆ దేశంపై 26 శాతం సుంకాలు విధిస్తున్నామని ఆయన తెలిపారు. దీనిపై ఇప్పటికే భారత ప్రభుత్వం, వైట్ హౌస్ మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

